మేలో తెలంగాణలో రాహుల్ టూర్: వరంగల్‌ సభలో పాల్గొననున్న కాంగ్రెస్ నేత

By narsimha lode  |  First Published Apr 14, 2022, 1:20 PM IST

ఈ ఏడాది మే 4,5 తేదీల్లో కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ తెలంగాణ రాష్ట్రంలో పర్యటించనున్నారు.   వరంగల్ జిల్లాలో జరిగే సభలో రాహుల్ గాంధీ పాల్గొంటారు. మే 5న  బోయిన్‌పల్లిలో జరిగే పార్టీ కార్యకర్తల సమావేశంలో రాహుల్ గాంధీ పాల్గొంటారు.


హైదరాబాద్: ఈ ఏడాది మే 4,5 తేదీల్లో కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్ Rahul Gandhi పర్యటించనున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ చివర్లోనే రాహుల్ గాంధీ Telangana లో పర్యటిస్తారని భావించారు. కానీ టూర్ షెడ్యూల్ లో కొన్ని మార్పులు చోటు చేసుకొన్నాయి.

ఈ ఏడాది మే 4న  Warangal  లో నిర్వహించే Congress  సభలో  రాహుల్ గాంధీ పాల్గొంటారు.  మే 5వ తేదీన Hyderabad బోయిన్‌పల్లిలో నిర్వహించే కాంగ్రెస్  కార్యకర్తల సమావేశంలో రాహుల్ గాంధీ పాల్గొంటారు.

Latest Videos

గతంలో ప్రకటించిన షెడ్యూల్ లో ఈ నెల 28న వరంగల్ లో జరిగే సభలో రాహుల్ గాంధీ పాల్గొంటారు. ఏఊప్రిల్ 29న  హైద్రాబాద్ లో కాంగ్రెస్ పార్టీ నేతల సమావేశంలో పాల్గొంటారని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. అయితే గతంలో ప్రకటించిన షెడ్యూల్ పూర్తిగా మారింది. మే 4,5 తేదీల్లో రాహుల్ గాంధీ తెలంగాణ రాష్ట్రంలో పర్యటించనున్నారు.

పార్టీ సంస్థాగత కార్యక్రమాల్లో భాగంగా సభ్యత్వ నమోదులో తెలంగాణ రాష్ట్రం టాప్ లో నిలిచింది. సుమారు 40 లక్షలకు పైగా కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేశారు.  కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకున్న వారికి భీమా సౌకర్యం కూడా కల్పించారు. 

2023 లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పార్టీ పట్టుదలతో ఉంది. టీఆర్ఎస్ ను  గద్దె దించడం కోసం అవసరమైన వ్యూహాంతో ముందుకు వెళ్లాలని  ఆ పార్టీ భావిస్తుంది. అయితే టీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయమని బీజేపీ రేసులో ముందుకు వచ్చింది. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో వచ్చిన ఫలితాలను బీజేపీ నేతలు చెబుతున్నారు. టీఆర్ఎస్ ను ఢీకొట్టే సత్తా ఉందని నిరూపించిన పార్టీకే  వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ వ్యతిరేక ఓటు గంప గుత్తగా షిఫ్ట్ కానుంది.

టీఆర్ఎస్ ను ఢీకొట్టే శక్తి తమకే ఉందని  ప్రజల్లో విశ్వాసం కల్పించేందుకు గాను కాంగ్రెస్ నేతలు ఇప్పటి నుండే ప్రయత్నాలు ప్రారంభించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. అయితే కాంగ్రెస్ నేతల మధ్య ఉన్న అనైక్యతే ఆ పార్టీకి పెద్ద మైనస్ పాయింట్ గా ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. రాహుల్ గాంధీ తో సమావేశం తర్వాత పార్టీ సీనియర్లు తమ మధ్య ఉన్న అనైక్యతను పక్కన పెట్టి పార్టీ కోసం పనిచేస్తామని కూడా నేతలు ప్రకటించారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చే వరకు  టీఆర్ఎస్, బీజేపీ తీరును ప్రజల వద్దకు తీసుకెళ్లాలని కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది.ఈ విషయమై ఆ పార్టీ నాయకత్వం కార్యాచరణను ప్లాన్ చేయనుంది.

గత రెండు టర్మ్ లు రాష్ట్రంలో పార్టీ అధికారానికి దూరమైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్టీని ఫణంగా పెట్టి తెలంగాణ ఇచ్చినా కూడా అధికారానికి దూరం కావడం కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి రాజకీయంగా నష్టం వాటిల్లింది. అయితే ఈ దఫా మాత్రం రాష్ట్రంలో అధికారాన్ని దక్కించుకోవాలని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. ఈ మేరకు పార్టీ ఎన్నికల వ్యూహాకర్తగా నియమించుకున్న సునీల్ వ్యూహాలకు అనుగుణంగా రాష్ట్రంలో కార్యక్రమాలను చేపట్టనున్నారు.

click me!