ప్రేమించినవాడే కట్నం కోసం వేధించడంతో... నవవధువు ఆత్మహత్య

Arun Kumar P   | Asianet News
Published : Jan 03, 2021, 12:54 PM IST
ప్రేమించినవాడే కట్నం కోసం వేధించడంతో... నవవధువు ఆత్మహత్య

సారాంశం

ప్రేమించి పెళ్లిచేసుకున్న వాడు కట్నం కోసం వేధించడాన్ని తట్టుకోలేకపోయిన ఓ నవవధువు ఆత్మహత్య చేసుకుంది.

నల్గొండ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ప్రేమించి పెళ్లిచేసుకున్నవాడే కట్నం కావాలంటూ వేధించడాన్ని తట్టుకోలేకపోయిన నవవధువు బలవన్మరణానికి పాల్పడింది.  

ఈ విషాద సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. కేతెపల్లి మండలం కొర్లపహాడ్‌ కు చెందిన యువతి సూర్యాపేటకు చెందిన ప్రణయ్ ను ప్రేమించింది. వీరిద్దరూ ఇటీవలే మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. పెళ్లియిన తర్వాత కొన్నాళ్లు బాగానే వున్న ప్రణయ్ ఆ తర్వాత తన అసలురూపాన్ని బయటపెట్టాడు. 

పెళ్లి సమయంలో కట్నం ఇవ్వలేదని... ఇప్పుడు తనకు కట్నం కావాలంటూ వేధించడం ప్రారంభించాడు. ఇలా ప్రేమించిన వాడే కాసుల కోసం కష్టాలు పెట్టడాన్ని తట్టుకోలేకపోయిన వివాహిత దారుణ నిర్ణయం తీసుకున్నాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగిన నవవధువు ఆత్మహత్యకు పాల్పడింది. 

ఈ ఆత్మహత్య సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. వివాహిత మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : అధికపీడనం ఎఫెక్ట్.. కుప్పకూలిన టెంపరేచర్స్, ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం
Telangana Rising Global Summit : తొలి రోజు రూ.1.88 లక్షల కోట్ల పెట్టుబడులు.. వేల ఉద్యోగాలు