తెలంగాణ కరోనా అప్ డేట్: తాజాగా 394 పాజిటివ్ కేసులు

Arun Kumar P   | Asianet News
Published : Jan 03, 2021, 10:04 AM ISTUpdated : Jan 03, 2021, 10:08 AM IST
తెలంగాణ కరోనా అప్ డేట్: తాజాగా 394 పాజిటివ్ కేసులు

సారాంశం

తెలంగాణలో తాజాగా అతి తక్కువగా కరోనా కేసులు బయటపడ్డాయి. 

హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య ఇటీవల గణనీయంగా తగ్గుతూ వస్తోంది. తాజాగా గత 24గంటల్లో(శుక్రవారం రాత్రి 8 గంటల నుండి శనివారం రాత్రి 8గంటల వరకు) రాష్ట్రవ్యాప్తంగా 40,190మందికి కరోనా టెస్టులు చేయగా కేవలం 394మందికి పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 2,87,502కు చేరితే టెస్టుల సంఖ్య 69,91,487కు చేరాయి.

ఇక ఇప్పటికే కరోనా బారినపడి చికిత్స పొందుతున్నవారిలో తాజాగా 574 మంది కోలుకున్నారు. దీంతో కరోనా నుండి రికవరీ అయినవారి మొత్తం సంఖ్య 2,80,565కి చేరింది. ఇలా కేసుల సంఖ్య తక్కువగా వుండి రికవరీల సంఖ్య ఎక్కువగా వుండటం వల్ల యాక్టివ్ కేసుల సంఖ్య తగ్గింది. ప్రస్తుతం రాష్ట్రంలో కేవలం 5,388 యాక్టివ్ కేసులు మాత్రమే వున్నట్లు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. ఇందులో హోం/సంస్థల ఐసోలేషన్ లో వున్న వ్యక్తుల సంఖ్య 3,210గా వుంది.  

ఇదిలావుంటే గత 24గంటల్లో రాష్ట్రంలో కరోనాతో ముగ్గురు మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1549కి చేరింది. రాష్ట్రంలో కరోనా మరణాల రేటు 0.53శాతంగా వుంటే దేశంలో ఇది 1.4శాతంగా వుంది. రికవరీ రేటు దేశంలో 96.1శాతంగా వుంటే రాష్ట్రంలో మాత్రం 97.58శాతంగా వుంది. 

జిల్లాలవారిగా కేసుల సంఖ్యను పరిశీలిస్తే నారాయణపేట లో కేసులేవి బయటపడలేవు. ఇక జోగులాంబ గద్వాల 2, కామారెడ్డి 6, ఆదిలాబాద్ 7, భూపాలపల్లి 4, జనగామ 67, జగిత్యాల 12, వనపర్తి 6, అసిఫాబాద్ 4, మహబూబ్ నగర్ 7, మహబూబాబాద్ 6, మెదక్ 3, నాగర్ కర్నూల్ 5,  నిర్మల్ 5, నిజామాబాద్ 7,  సిరిసిల్ల 6, వికారాబాద్ 5, వరంగల్ రూరల్ 7,  ములుగు 6, పెద్దపల్లి 11, సిద్దిపేట 8, సూర్యాపేట 11, భువనగిరి 10, మంచిర్యాల 11, నల్గొండ 10 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. ఇక హైదరాబాద్(జిహెచ్ఎంసి)లో అత్యధికంగా 81కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత మేడ్చల్ 31, రంగారెడ్డి 36, కొత్తగూడెం 15, కరీంనగర్ 29, ఖమ్మం 9,  సంగారెడ్డి 12, వరంగల్ అర్బన్  162కేసులు నమోదయ్యాయి.

పూర్తి వివరాలు: 
 

PREV
click me!

Recommended Stories

ఫ్యూచర్ సిటీ భవనాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి CM Revanth Reddy Inaugurates Future City
CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి పవర్ ఫుల్ స్పీచ్| Asianet Telugu