సుపారీ ఇచ్చి ప్రియుడి కిడ్నాప్ చేయించిన వివాహిత.. భయపెట్టి.. బలవంతంగా దండలు మార్పించి పెళ్లి చేసుకుని...

By SumaBala BukkaFirst Published Jan 27, 2022, 10:42 AM IST
Highlights

నర్సంపేట శివారులోని కమలాపురానికి చెందిన ముత్యం శ్రీను నర్సంపేటలో మద్యం షాపు నిర్వహిస్తూనే ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన ఓ వివాహితకు రోజువారీ వసూలు కింద కొంత అప్పుగా ఇచ్చాడు. వసూలు కోసం తరచూ ఆమె ఇంటికి వెళ్లడంతో ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. ఇది తెలిసి ఆ మహిళ భర్త ఇంటి నుంచి ఎటో వెళ్లిపోయాడు.

వరంగల్ : భర్త, ఇద్దరు పిల్లలు ఉన్న ఓ మహిళ, మరో వ్యక్తితో 
Extramarital affair పెట్టుకుంది. పైగా తనతో marriageకి అతడు అంగీకరించిలేదనే కోపంతో ఓ supari gangతో kidnap చేయించింది. భయపెట్టి.. బలవంతంగా దండలు మార్పించి పెళ్లి చేసుకుంది. warangal జిల్లా నర్సంపేట పట్టణంలో ఈ ఘటన వెలుగుచూసింది. 

పోలీసులు కథనం ప్రకారం.. నర్సంపేట శివారులోని కమలాపురానికి చెందిన ముత్యం శ్రీను నర్సంపేటలో మద్యం షాపు నిర్వహిస్తూనే ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన ఓ వివాహితకు రోజువారీ వసూలు కింద కొంత అప్పుగా ఇచ్చాడు. వసూలు కోసం తరచూ ఆమె ఇంటికి వెళ్లడంతో ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. ఇది తెలిసి ఆ మహిళ భర్త ఇంటి నుంచి ఎటో వెళ్లిపోయాడు.

అయితే, శ్రీను వల్లే తన కాపురం దెబ్బతిన్నదంటూ ప్రియుడిని ఆమె నిలదీసింది. 2 నెలల క్రితం పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ జరిగింది. శ్రీను కూడా వివాహితుడు. అతనికి పిల్లలు కూడా ఉన్నారు. నష్టపరిహారంగా గతంలో ఇచ్చిన అప్పును మాఫీ చేసి మహిళకు శ్రీను అదనంగా రూ. 1.5 లక్షలు ఇవ్వాలని తీర్మానసం చేశారు. 

అనంతరం ఆ వివాహిత ప్రియుడినే పెళ్లి చేసుకుని, అతని ఆస్తిని దక్కించుకోవాలని ప్లాన్ చేసింది. శ్రీను కిడ్నాప్ కు ఓ సుపారీ గ్యాంగ్ తో ఒప్పందం చేసుకుంది. బుధవారం పట్టణ శివారులో గ్యాంగ్ సభ్యులతో కలిసి శ్రీనును బలవంతంగా కారులో ఎక్కించుకుని పాకాల వైపు వెళ్లింది. స్థానికులు శ్రీను కుటుంబ సభ్యులకు తెలపడంతో బాధితుడి కుమారుడు భరత్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

తమను పోలీసులు వెంబడిస్తున్నారని గ్రహించిన సుపారీ గ్యాంగ్ శ్రీనును, మహిళను గంజేడు అడవిలోకి తీసుకెళ్లి దండలు మార్పించి ఫొటోలు తీశారు. కొంత ఆస్తిని రాసివ్వాలన్నారు. పెద్ద మనుషులవద్ద మాట్లాడుకుందామని అతడు చెప్పడంతో నర్సంపేటలోని వ్యవసాయ మార్కెట్ యార్డు ఎదురుగా మహిళ ఇంట్లో అతడిని వదిలేసి పరారయ్యారు. ప్రస్తుతం శ్రీనును పోలీసులు విచారిస్తున్నారు. 

ఇదిలా ఉండగా, నిరుడు డిసెంబర్ లో తమిళనాడులో  తమను తరచూ బెదిరిస్తుండడంతో Mercenariesతో మాట్లాడి తోటి విద్యార్థినులే యువకుడిని murder చేయించినట్లు దర్యాప్తులో తేలింది. తమిళనాడు, ఆరంబాక్కం పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. డిసెంబర్ 19, 20 ప్రాంతంలో గుమ్మడిపూండి, పెద్ద ఓబులాపురం పరిధిలోని ఈచ్చక్కాడులో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం భూమిలో పాతిపెట్టి ఉండడాన్ని స్థానికులు గుర్తించి policeలకు సమాచారం అందించారు.

తహసిల్దార్ మహేష్ సమక్షంలో పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం పొన్నేరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా,  మృతుడు Chengalpattu జిల్లా గూడువాంజేరి సమీపంలోని మన్నివాక్కానికి చెందిన ప్రేమ్ కుమార్(20)గా గుర్తించారు. 

చెన్నై, మీనంబాక్కం కాలేజీలో చదువుతున్న ఇతను తోటి విద్యార్ధినులతో Obscenityగా మాట్లాడేవాడని, ఇలా సంభాషించిన ఆడియోను తల్లిదండ్రులకు పంపినట్లు బెదిరించేవాడని తెలిసింది. ఇలా అతని ప్రవర్తనతో ఇబ్బందులు ఎదుర్కొన్న విద్యార్థినులు కిరాయి హంతకుల సాయంతో ప్రేమ్ కుమార్ ను హత్య చేయించినట్లు బయటపడింది. కేసు దర్యాప్తులో ఉంది. 

click me!