Hanmakonda Crime: న్యూఇయర్ పార్టీలో అపశృతి... క్వారీ గుంతలో శవాలుగా తేలిన యువకులు

By Arun Kumar PFirst Published Jan 2, 2022, 10:06 AM IST
Highlights

ఎంతో ఆనందంగా స్నేహితులతో కలిసి నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్న ఇద్దరు యువకులు తెల్లవారేసరికి క్వారీ గుంతలో శవాలుగా తేలిన ఘటన హన్మకొండ జిల్లాలో చోటుచేసుకుంది. 

హన్మకొండ: నూతన సంవత్సర వేడుకల్లో (news year celebrations) విషాదం చోటుచేసుకుంది. స్నేహితులతో కలిసి పార్టీ చేసుకున్న ఇద్దరు యువకులు రాత్రంతా కనిపించకుండా పోయి తెల్లారేసరికి క్వారీ గుంతలో శవాలుగా తేలారు. ఈ దుర్ఘటన హన్మకొండ జిల్లాలో వెలుగుచూసింది.  

పోలీసులు, బాధిత కుటుంబాలు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. హన్మకొండ జిల్లా (hanmakonda district) హసన్ పర్తి మండలం చింతకుంట గ్రామానికి చెందిన శ్రీకర్, ఆకాష్ మరో ముగ్గురు స్నేహితులతో కలిసి నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నారు. ఐదుగురు స్నేహితులు కలిసి పార్టీ చేసుకోగా కేవలం ముగ్గురు మాత్రమే ఇళ్లకు చేరుకున్నారు. శ్రీకర్, ఆకాష్ కనిపించకుండా పోయారు. 

తమ పిల్లలు ఇళ్ళకు చేరుకోకపోయేసరికి తల్లిదండ్రులు కంగారు పడిపోయి చుట్టుపక్కల వెతికారు. అయితే ఓ క్వారీ గుంతలో ఇద్దరి మృతదేహాలను గుర్తించిన గ్రామస్తులు వారి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. దీంతో అక్కడికి చేరుకున్న వారు కన్న బిడ్డల శవాలను చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. 

read more  Vikarabad SI : పెళ్లైన వారం రోజులకే వికారాబాద్‌ వన్‌టౌన్‌ ఎస్‌ఐ మృతి

యువకులకు మృతిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలిని పరిశీలించారు. గ్రామస్తుల సహకారంతో రెండు మృతదేహాలను బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. 

యువకులిద్దరు ప్రమాదవశాత్తు గుంతలో పడి ప్రాణాలు కోల్పోయారా లేక న్యూఇయర్ పార్టీలో ఇంకేమయినా జరిగిందా అన్నది తెలుసుకునే పనిలో పడ్డారు పోలీసులు. ఈ క్రమంలోనే ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు యువకులతో కలిసి పార్టీ చేసుకున్న మిగతా ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. వీరు విచారణలో చెప్పే విషయాలు, పోస్టుమార్టం ఆధారంగా ఆకాష్, శ్రీకర్ ఎలా మృతిచెందారో తేలనుంది. 

read more  విజయనగరం జిల్లాలో దారుణం...పోలీసునంటూ బెదిరించి ఇద్దరు యువతులపై అత్యాచారం

ఇక నూతన సంవత్సర వేడుకల కోసం భారీగా బాణాసంచా తయారీ చేపట్టిన ఓ ప్యాక్టరీలో పేలుళ్లు సంభవించి నలుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. తమిళనాడులోని విరుద్‌నగర్ జిల్లా‌ శివకాశీలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. 

నూతన సంవత్సరాదిన శివకాశి సమీపంలోని సమీపంలోని మెట్టుపట్టి గ్రామంలో ఉన్న బాణసంచా ఫ్యాక్టరీ (crackers factory)లో ఈ పేలుడు చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందగా.. పలువురు గాయపడ్డారు. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. 

ఈ ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాప సిబ్బంది వెంటనే ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అయితే పేలుడు తీవ్రత ఎక్కువగా ఉండటంతో మృతుల సంఖ్య ఎక్కువగా వుందని స్థానిక పోలీసులు చెబుతున్నారు. గాయపడిన వారిలో చాలామంది ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. 

  
 

click me!