ప్రేమ పెళ్లి.. భర్తకు వీడియో కాల్ చేసి భార్య ఆత్మహత్య..!

Published : Sep 02, 2021, 08:41 AM ISTUpdated : Sep 02, 2021, 08:45 AM IST
ప్రేమ పెళ్లి.. భర్తకు వీడియో కాల్ చేసి భార్య ఆత్మహత్య..!

సారాంశం

రాజేంద్రనగర్ పరిధి చైతన్య విలాస్ కాలనీలోని అపార్ట్ మెంట్ లో కాపురం పెట్టాడు. బెంగళూరు నుంచి వచ్చి వెళ్తుండేవాడు. నాగదేవి బ్యూటీషియన్ గా పనిచేస్తోంది.

వారు పది నెలల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.  అయితే.. అనూహ్యంగా చిన్న విషయానికే భర్తతో గొడవపడి.. ఆవేశంలో ఆత్మహత్య  చేసుకుంది. భర్తకు వీడియో కాల్ చేసి మరీ..  ఆమె బలవన్మరణానికి పాల్పడటం గమనార్హం. అతను అప్రమత్తమై.. పక్కింటికి వారికి ఫోన్ చేసి చెప్పేలోపే..  జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ సంఘటన రాజేంద్ర నగర్ లో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

రాజమహేంద్రవరానికి చెందిన నాగదేవి(25) దిల్ సుఖ్ నగర్ లో ఉండే సాయి శివ నగరంలోని ఓ కాలేజీలో డిగ్రీ చదివారు. అప్పుడే  నాగదేవి, సాయి శివ ప్రేమించుకున్నారు. చదువు తర్వాత సాయి శివకు బెంగళూరులో ఉద్యోగం వచ్చింది. దీంతో.. 10 నెలల కిందట ఇంట్లో చెప్పకుండా  పెళ్లి చేసుకున్నారు.

రాజేంద్రనగర్ పరిధి చైతన్య విలాస్ కాలనీలోని అపార్ట్ మెంట్ లో కాపురం పెట్టాడు. బెంగళూరు నుంచి వచ్చి వెళ్తుండేవాడు. నాగదేవి బ్యూటీషియన్ గా పనిచేస్తోంది. శివ సోదరి వివాహం ఉండటంతో దిల్ సుఖ్ నగర్ వచ్చాడు. సోదరి పెళ్లి తర్వాత తమ పెళ్లి విషయాన్ని కుటుంబసభ్యులకు చెబుతానని భార్యతో చెప్పాడు.

మంగళవారం రాత్రి నాగదేవి భర్తకు ఫోన్ చేసి వెంటనే ఇంటికి రావాలని కోరింది. పెళ్లి తర్వాత వస్తానని చెప్పడంతో.. వెంటనే వీడియో కాల్ చేసి ఇంటికి రాకపోతే.. ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది. ఫోన్ పెట్టేసి.. అపార్ట్మెంట్ పక్క ఫ్లాట్ వారిని అప్రమత్తం చేశాడు. వారు వెళ్లేలోపే ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు  చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఆదిలాబాద్ కంటే హైదరాబాద్ లోనే లోయెస్ట్ టెంపరేచర్స్ .. స్కూల్ టైమింగ్స్ చేంజ్
ముగిసిన పల్లె పోరు.. కాంగ్రెస్‌దే ఆధిపత్యం.. బీఆర్ఎస్ సంతృప్తి.. ఏయే పార్టీలు ఎన్ని స్థానాలు గెలిచాయంటే