అత్తింటి వేధింపులు... ఒంటికి నిప్పు అంటించుకొని..

By telugu news teamFirst Published Jul 15, 2020, 8:05 AM IST
Highlights

సంతోష్, స్రవంతి దంపతులు శేరిలింగంపల్లిలో జీవనం సాగిస్తున్నారు. కాగా.. లాక్ డౌన్ సమయంలో సంతోష్ తల్లి.. వీరివద్దకే వచ్చి ఉంటోంది. ఈ క్రమంలో ఆమె కారణంగా భార్యభర్తల మధ్య దూరం బాగా పెరిగిపోయింది.

అత్తింటి వేధింపులు తట్టుకోలేక  ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. తెల్లవారుజామున ఇంట్లో ఒంటికి నిప్పు అంటించుకొని బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషాదకర సంఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

కామారెడ్డికి చెందిన విశ్వనాథ్, పద్మజ కుమారుడు కంకణాల సంతోష్‌కు, శ్రీకాకుళం రాజాంకు చెందిన మోహన్‌రావు, విజయల రెండవ కూతురు స్రవంతి(31)లకు 2017 అక్టోబర్‌లో వివాహం జరిగింది. వారికి రెండు సంవత్సరాల కుమారుడు శషాంక్‌ ఉన్నాడు.సంతోష్‌ తల్లితండ్రులు 30 ఏళ్ల క్రితం నగరానికి వచ్చి స్థిరపడ్డారు.

కాగా.. సంతోష్, స్రవంతి దంపతులు శేరిలింగంపల్లిలో జీవనం సాగిస్తున్నారు. కాగా.. లాక్ డౌన్ సమయంలో సంతోష్ తల్లి.. వీరివద్దకే వచ్చి ఉంటోంది. ఈ క్రమంలో ఆమె కారణంగా భార్యభర్తల మధ్య దూరం బాగా పెరిగిపోయింది.

సోమవారం రాత్రి కూడా భర్త సంతోష్, అత్తతో గొడవ జరిగింది. ఈక్రమంలో అనుమానాస్పద స్థితిలో స్రవంతి మంగళవారం తెల్లవారుజామున 3.40 గంటల సమయంలో ఒంటిపై పెట్రోల్‌ పోసుకొని నిప్పంటించుకొని వారు ఉంటున్న మూడవ అంతస్తు నుంచి లిఫ్ట్‌ ద్వారా సెల్లార్‌లో కిందకు వచ్చి లిఫ్ట్‌ డోర్‌ వద్ద పడిపోయింది. అక్కడ విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీ గార్డు చూసి ఇంట్లో ఉన్న వారికి, పోలీసులకు సమాచారం అందించారు.

సరిగ్గా అదే సమయంలో పెట్రోలింగ్ పోలీసులు అటుగా వెళుతూ.. విషయాన్ని తెలుసుకున్నారు. వారు వెళ్లి చూసే సమయానికి ఆమె చనిపోయి కనిపించింది. సోమవారం సాయంత్రం బయటికి వెళ్లిందని అప్పుడు వెంట పెట్రోల్‌ తెచ్చుకొని ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. స్రవంతి ఒంటికి నిప్పంటించుకొని మూడు అంతస్తుల నుంచి కిందకు రావడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 

భర్త, అత్త వేధింపుల కారణంగానే తన కూతురు ఆత్మహత్యకు పాల్పడిందని, వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు స్రవంతి బంధువులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు. 

click me!