మైనర్ బాలికపై సోదరుడి అత్యాచారం... శీలానికి వెలకట్టిన గ్రామ పెద్దలు...

Arun Kumar P   | Asianet News
Published : Aug 23, 2021, 01:58 PM ISTUpdated : Aug 23, 2021, 02:03 PM IST
మైనర్ బాలికపై సోదరుడి అత్యాచారం... శీలానికి వెలకట్టిన గ్రామ పెద్దలు...

సారాంశం

అభం శుభం తెలియని మైనర్ బాలికను ఓ కామాంధుడు లోబర్చుకుని గర్భవతిని చేస్తే... ఆమె శీలానికి వెలకట్టి నిందితుడికి కాపాడే ప్రయత్నం చేశారు గ్రామ పెద్దలు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. 

మహబూబాబాద్: అమ్మాయి శీలానికి ఖరీదు కట్టారు గ్రామ పెద్దలు. సోదరి వరస అయ్యే అమ్మాయిని లోబర్చుకుని గర్భవతిని చేసిన కామాంధుడిని కాపాడేందుకు గ్రామ పెద్దలు ప్రయత్నించారు. బాధిత బాలిక కుటుంబానికి కేవలం డబ్బులు చెల్లిస్తే చాలని తీర్పునిచ్చారు. ఇలా మైనర్ బాలిక శీలానికి వెలకట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

వివరాల్లోకి వెళితే... మహబూబాబాద్ జిల్ల మరిపెడ మున్సిపాలిటీ పరిధిలోని బొత్తలతండాకు చెందిన వివాహితుడు చెల్లెలి వరసయ్యే మైనర్ పై కన్నేశాడు. బాలికకు మాయమాటలు చెప్పి లోబర్చుకుని పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు.  

read more  ప్రియురాలు, స్నేహితులు మోసం చేశారు: ఫేస్‌బుక్ లైవ్‌లోనే హైద్రాబాద్‌లో యువకుడి సూసైడ్

అయితే ఇటీవల బాలిక అనారోగ్యంతో బాధపడుతుంటే తల్లిదండ్రులు హాస్పిటల్ కు తీసుకెళ్లారు. పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు బాలిక గర్భం దాల్చినట్లు గుర్తించారు. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పగా వారు బాలికను నిలదీశారు. దీంతో తనపై కొద్దిరోజులుగా జరుగుతున్న అత్యాచారం గురించి తెలిపింది. 

విషయం తెలియడంతో బాధిత బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయకుండా నిందితుడు గ్రామ పెద్దలను ఆశ్రయించాడు. వారు బాలిక తల్లిదండ్రులను పిలిపించి పంచాయితీ చేశారు. బాలికపై అఘాయిత్యానికి పాల్పడి గర్భవతిని చేసినందుకు గాను నిందితుడు రూ.8లక్షలు చెల్లిస్తాడని... పోలీసులు, కేసులు అంటూ హంగామా చేయవద్దని సూచించారు. ఇందుకు మైనర్ బాలిక తల్లిదండ్రులను ఒప్పించారు. అయితే తాజాగా ఈ విషయం బయటకు పొక్కింది.

PREV
click me!

Recommended Stories

100 ఏళ్లైన చెక్కుచెద‌ర‌ని, అతిపెద్ద ప్రార్థ‌న మందిరం.. హైద‌రాబాద్‌కు ద‌గ్గ‌రలో అద్భుత నిర్మాణం
Top 5 Cleanest Railway Stations : దేశంలో అత్యంత పరిశుభ్రమైన రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?