బంగ్లాదేశ్ తో పోలిస్తే భారత్ దిగదుడుపు: కిషన్ రెడ్డికి హరీష్ రావు కౌంటర్

By telugu teamFirst Published Aug 23, 2021, 12:36 PM IST
Highlights

తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందనే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలను తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్ రావు కొట్టిపారేశారు. తెలంగాణ గత ఆరేళ్ల కాలంలో మెరుగైన అభివృద్ధిని సాధించిందని ఆయన చెప్పారు.

హైదరాబాద్: రాష్ట్రాభివృద్ధి కుంటుపడిందని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి చేసిన విమర్శలను తెలంగాణ ఆర్థిక మంత్రి టీ. హరీష్ రావు కొట్టిపారేశారు. తెలంగాణ రాష్ట్రం ఆర్థికాభివృద్ధిలో ముందుకు సాగుతోందని ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. కిషన్ రెడ్డితో పాటు తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అవగాహనారాహిత్యంతో మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. 

కేంద్రం పనితీరు కన్నా తెలంగాణ రాష్ట్రం పనితీరు మెరుగ్గా ఉందని, ఈ విషయాన్ని కిషన్ రెడ్డి అర్థం చేసుకోవాలని ఆయన అన్నిారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గణాంకాల ప్రకారమే తాను మాట్లాడుతున్నట్లు ఆయన తెలిపారు. బంగ్లాదేశ్ ఆర్థిక పరిస్థితి పెరుగుతూ పోతుంటే భారతదేశం ఆర్థికాభివృద్ది తగ్గుతూపోతోందని ఆయన అన్నారు. బంగ్లాదేశ్ లో తలసరి ఆదాయం భారతదేశం తలసిరి ఆదాయం కన్నా పది డాలర్లు ఎక్కువగా ఉందని ఆయన చెప్పారు. వృద్ధి రేటులో భారతదేశం కన్నా బంగ్లాదేశ్ మెరుగ్గా ఉందని ఆయన చెప్పారు. 

గత ఆరేళ్లలో తెలంగాణ రాష్ట్రం సగటు ఆర్థిక వృద్ధి రేటు 11.7 శాతం ఉందని, క్లిష్ట సమయాల్లో కూడా వృద్ధిరేటులో సానుకూల ప్రగతి సాధించామని ఆయన చెప్పారు. గత ఆరేళ్లలో అన్ని దక్షిణాది రాష్ట్రాల్లో కన్నా తెలంగాణ వృద్ధి రేటు అధికంగా ఉందని, తాము నెంబర్ వన్ స్థానంలో ఉన్నామని ఆయన చెప్పారు. 

click me!