అనారోగ్య సమస్యలు: మావోయిస్టు అగ్రనేత మల్లా రాజిరెడ్డి కన్నుమూత ..?

By narsimha lode  |  First Published Aug 18, 2023, 12:48 PM IST


 మావోయిస్టు అగ్రనేత   మల్లా రాజిరెడ్డి కన్నుమూశారు.  రాజిరెడ్డిది ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని  ముత్తారం మండలం శాస్త్రులపల్లి.


హైదరాబాద్: మావోయిస్టు అగ్రనేత  మల్లా రాజిరెడ్డి  అలియాస్ సంగ్రామ్ కన్నుమూసినట్లుగా వార్తలు వస్తున్నాయి. అనారోగ్యంతో రాజిరెడ్డి  మరణించినట్టుగా సమాచారం. అయితే ఆయన మరణంపై అధికారికంగా ప్రకటన వెలువడాల్సి వుంది. ఆయన వయస్సు 70 ఏళ్లు.మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడిగా  రాజిరెడ్డి  కొనసాగుతున్నాడు.   రాజిరెడ్డిపై  కోటి రూపాయాల రివార్డు ఉంది.  ఛత్తీస్ ఘడ్,  ఒరిస్సా  దండకారణ్యంలో మావోయిస్టు పార్టీ నిర్మాణంలో రాజిరెడ్డి కీలకంగా వ్యవహరించారు. రాజిరెడ్డి  స్వస్థలం  పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఎగ్లాస్ పూర్ పరిధిలోని శాస్త్రులపల్లి. 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  అప్పటి పీపుల్స్ వార్ పార్టీని విస్తరించడంలో  రాజిరెడ్డి కీలకంగా వ్యవహరించారు. కరీంనగర్, ఖమ్మం, వరంగల్ జిల్లాలో  పార్టీని బలోపేతం చేయడంలో రాజిరెడ్డి కీలకంగా పనిచేశారు.దేశంలోని పలు రాష్ట్రాల్లో  మావోయిస్టు పార్టీ విస్తరణలో  రాజిరెడ్డి  కీలకంగా వ్యవహరించారు.  మల్లారెడ్డికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం వాళ్లు హైదరాబాదులో ఉంటున్నారు. భార్య మాలతి ఎనిమిదేళ్లు జైలులో ఉండి, విడుదలయ్యారు. మల్లారెడ్డి సంగ్రామ్ అనే పేరుతో చెలామణి అయ్యారు.

Latest Videos

undefined

1977 లో  అజ్ఞాతంలోకి మల్లారెడ్డి  వెళ్లారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లలోని  మంథని, మహదేవ్‌పూర్ ఏరియా దళంలో పని చేశారు.  1977లోనే  ఆయనను జగిత్యాల జిల్లా పోలీసులు  అరెస్ట్  చేశారు. జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత  తిరిగి ఆయన   అజ్ఞాతంలోకి  వెళ్లిపోయారు. 1996-97లో  రాజిరెడ్డి  మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడయ్యారు. 2007 డిసెంబర్ లో కూడ  కేరళలో  ఏపీ పోలీసులు రాజిరెడ్డిని అరెస్ట్  చేశారు.  జైలు నుండి విడుదలైన తర్వాత  ఆయన తిరిగి  అజ్ఞాతంలోకి  వెళ్లిపోయారు.  ఆరోగ్య సమస్యలతో  రాజిరెడ్డి లొంగిపోతారనే  ప్రచారం గతంలో సాగింది. కానీ  ఆయన  లొంగిపోలేదు. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో జరిగిన  పలు  మావోయిస్టు పార్టీ  చేపట్టిన దాడుల ఘటనల్లో రాజిరెడ్డి పై కేసులు నమోదయ్యాయి.  

ఇంటర్ చదువుకునే  సమయంలోనే  ఆయన ఆర్ఎస్‌యూలో పనిచేశారు. విద్యాభ్యాసం పూర్తై  పెళ్లై కూతురు జన్మించిన తర్వాత రాజిరెడ్డి  అజ్ఞాతంలోకి వెళ్లారురాజిరెడ్డి  భార్య మాలతి కూడ  మావోయిస్టు పార్టీలో పనిచేశారు.  2008లో ఆమెను  పోలీసులు అరెస్ట్ చేశారు ఎనిమిదేళ్ల తర్వాత ఆమె విడుదలైంది. 

 

click me!