గుండెపోటు: మావోయిస్టు అగ్రనేత కటకం సుదర్శన్ మృతి

By narsimha lode  |  First Published Jun 4, 2023, 9:40 AM IST

మావో యిస్టు  అగ్రనేత  కటకం సుదర్శన్  మృతి చెందినట్టుగా  ఆ పార్టీ ప్రకటించింది.  సుదర్శన్  మృతిపై  ఈ నెల  5వ తేదీ నుండి ఆగష్టు  3వ తేదీ వరకు  సంస్మరణ సమావేశాలకు  ఆ పార్టీ పిలుపునిచ్చింది.


హైదరాబాద్: మావోయిస్టు  పార్టీ అగ్రనేత  కటకం సుదర్శన్  అలియాస్ ఆనంద్ మృతి చెందారు.  ఈ మేరకు మావోయిస్టు  పార్టీ  ప్రకటనను విడుదల  చేసింది.  ఈ ఏడాది మే 31వ తేదీన  కటకం సుదర్శన్  మృతి చెందినట్టుగా మావోయిస్టు  పార్టీ ప్రకటించింది. 

కటకం సుదర్శన్  స్వస్థలం  మంచిర్యాల జిల్లా  బెల్లంపల్లి కన్నాలబస్తీ.  గుండెపోటుతో  సుదర్శన్ మృతి చెందినట్టుగా  మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ  ప్రకటించింది.    ఆనంద్ మృతి చెందడంతో  ఈ నెల  5వ తేదీ నుండి ఆగష్టు  3 వరకు  ఆనంద్ సంస్మరణ  సమావేశలు  నిర్వహించాలని మావోయిస్టు  పార్టీ  కేంద్ర కమిటీ కోరింది.  మెరుపు దాడుల  నిర్వహణలో  సుదర్శన్ దిట్ట. ఆనంద్ మృతి మావోయిస్టు  పార్టీకి తీరనిలోటు.

Latest Videos

మావోయిస్టు పార్టీలో  అగ్రనేతలు  వరుసగా మృత్యువాత పడుతున్నారు.  ఉమ్మడి  ఏపీ రాష్ట్రంలో  సుదీర్ఘ కాలం పాటు  రాష్ట్ర కార్యదర్శిగా పనిచేసిన రామకృష్ణ  అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే.

2011లో  దంతెవాడ మారణకాండలో  కటకం సుదర్శన్ మాస్టర్ మైండ్ గా  భద్రతా దళాలు  అనుమానించాయి.  దంతెవాడలో మావోలు జరిపిన దాడిలో  70 మంది  సీఆర్‌పీఎస్ సిబ్బంది  మృతి చెందారు. గెరిల్లా  యుద్ధ  వ్యూహకర్తగా  కటకం సుదర్శన్ ప్రసిద్ది.

 మంచిర్యాల జిల్లాకు  చెందిన కటకం సుదర్శన్ 1980లో  కొండపల్లి సీతారామయ్య  నేతృత్వంలోని  పీపుల్స్ వార్ గ్రూప్ లో  చేరారు. పీపుల్స్ వార్ లో చేరడానికి ముందు  కటకం సుదర్శన్  వరంగల్  పాలిటెక్నిక్  విద్యనభ్యసించారు.  ఉమ్మడి  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు  పాటు ఛత్తీస్ ఘడ్ దండకారణ్యంలోని  ఆదీవాసీలు  నివసించే  ప్రాంతం వరకు  మావోయిస్టు ఉద్యమ విస్తరణలో  ఆనంద్ పాత్ర కీలకమైంది.సుదర్శన్  భార్య  సాధన కూడా  నక్సలైట్.   కొన్నెళ్ల క్రితం  జరిగిన  ఎన్ కౌంటర్ లో   ఆమె మృతి చెందారు.


 

click me!