అమెరికాలో నిజామాబాద్ యువకుడు మృతి.. ఎలాగంటే ?

Published : Jun 04, 2023, 06:55 AM IST
అమెరికాలో నిజామాబాద్ యువకుడు మృతి.. ఎలాగంటే ?

సారాంశం

ఉన్నత చదువులు కొనసాగించేందుకు అమెరికాకు వెళ్లిన నిజామాబాద్ యువకుడు అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఈ రోడ్డు ప్రమాదం న్యూజెర్సీలో శనివారం చోటు చేసుకుంది. 

అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ యువకుడు మరణించాడు. భీమ్ గల్ మండలం బడాభీమ్ గల్ గ్రామానికి చెందిన గుర్రపు శైలేష్ బయోమెడికల్‌ ఇంజినీరింగ్‌ చదివేందుకు గతేడాది సెప్టెంబర్ నెలలో అమెరికాకు వెళ్లాడు. అక్కడ న్యూజెర్సీలో ఉంటూ తన స్నేహితులతో కలిసి కాలేజీకి వెళ్తూ ఉండేవాడు.

యూపీలో దారుణం.. మాయమాటలు చెప్పి 8 ఏళ్ల బాలికపై 80 ఏళ్ల వృద్ధుడు లైంగికదాడి..

ఈ క్రమంలో శనివారం కూడా ఎప్పటిలాగే తన స్నేహితులతో కలిసి కారులో ప్రయాణిస్తున్నాడు. అయితే ఆ కారు ప్రయాణిస్తూ ఉండగా.. న్యూజెర్సీలోని సెల్టన్ సర్కిల్ వద్ద మరో కారు వేగంగా వచ్చి అదుపుతప్పి, పెట్రోల్ ట్యాంకర్ ను ఢీకొట్టింది. దీంతో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో శైలేష్ కు తీవ్ర గాయాలుకావడంతో అక్కడికక్కడే చనిపోయాడు. కాగా.. శైలేష్ తండ్రి సత్యం కొన్నేళ్ల కిందట గల్ఫ్ వెళ్లి తిరిగి ఇంటికి చేరుకున్నాడు. తల్లి గృహిణిగా ఉన్నారు. శైలేష్ కు ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు. వారిద్దరూ ఇప్పుడు ఉన్నత చదువులు కొనసాగిస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

సంగారెడ్డి భహిరంగ సభలో CM రేవంత్ రెడ్డి పవర్ ఫుల్ స్పీచ్| CM Revanth Reddy Smart Ration Cards Launch
స్వాతంత్య్ర వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి పవర్ ఫుల్ స్పీచ్ | CM Revanth Reddy Independence Day Speech