భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎన్ కౌంటర్: మావోయిస్టు మృతి

Published : Sep 03, 2020, 10:27 AM IST
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎన్ కౌంటర్: మావోయిస్టు మృతి

సారాంశం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని  దేవలగూడెం వద్ద గురువారం నాడు జరిగిన ఎన్ కౌంటర్ లో ఓ మావోయిస్టు మృతి చెందాడు.మరో మావోయిస్టు పారిపోయినట్టుగా పోలీసులు చెప్పారు.  

భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని  దేవలగూడెం వద్ద గురువారం నాడు జరిగిన ఎన్ కౌంటర్ లో ఓ మావోయిస్టు మృతి చెందాడు.మరో మావోయిస్టు పారిపోయినట్టుగా పోలీసులు చెప్పారు.

జిల్లాలోని గుండాల మండలం దేవలగూడెం వద్ద మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకొన్నట్టుగా పోలీసులు ప్రకటించారు. 

సంఘటన స్థలాన్ని జిల్లా ఎస్పీ సునీల్ సందర్శించారు. జిల్లాలోని యాక్షన్ టీమ్, దళం సంచరిస్తోందని సమాచారం ఆధారంగా పోలీసులు కూంబింగ్ చేస్తుండగా ఎదురుకాల్పులు చేసుకొన్నట్టుగా  పోలీసులు ప్రకటించారు.

చనిపోయిన మావోయిస్టు వయస్సు 25 ఏళ్లు ఉంటుందని పోలీసులు చెప్పారు. సంఘటన స్థలం నుండి మరో మావోయిస్టు బైక్ పై పారిపోయినట్టుగా పోలీసులు తెలిపారు.ఎన్ కౌంటర్ లో చనిపోయిన మావోయిస్టు ను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని ఎస్పీ తెలిపారు.మృతుని వద్ద ఒక షార్ట్ వెపన్ ను స్వాధీనం చేసుకొన్నామన్నారు. 

ఈ  ఏడాది జూలై మాసంలో కొత్తగూడెం జిల్లాల్లో పోలీసులకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాాల్పుల్లో మావోయిస్టులు తప్పించుకొన్నారు. మావోయిస్టులు రిక్రూట్ మెంట్ పెంచుకొంటున్నారని ఆ సమయంలో పోలీసుుల గుర్తించారు, తెలంగాణలో బలపడేందుకు గాను రిక్రూట్ మెంట్ దిశగా మావోయిస్టులు ప్లాన్ చేస్తున్నారని  పోలీసులు అనుమానిస్తున్నారు.


 

PREV
click me!

Recommended Stories

Cold wave: హైదరాబాదా లేదా క‌శ్మీరా? దారుణంగా పడిపోతున్న టెంపరేచర్, వచ్చే 3 రోజులూ ఇంతే
Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు