తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతూనే ఉంది. తాజాగా తెలంగాణలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య లక్షా 33 వేల మార్కును దాటింది. గత 24 గంటల్లో మరో 10 మంది మృత్యువాత పడ్డారు.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. కేసుల సంఖ్య ఏ మాత్రం తగ్గడం లేదు. గత 24 గంట్లలో తెలంగాణలో 2817 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య లక్షా 33 వేల 406కు చేరుకుంది.
గత 24 గంటల్లో తెలంగాణ కరోనా వైరస్ కారణంగా 10 మంది మృత్యువాత పడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 856కు చేరుకుంది. హైదరాబాదులో యథావిధిగానే 400కు పైగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో లక్షా 13 వేల మంది కరోనా వైరస్ నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జీ అయ్యారు. ఇంకా 32,537 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
తెలంగాణలో జిల్లాలవారీగా గత 24 గంటల్లో నమోదైన కరోనా కేసులు
ఆదిలాబాద్ 36
భద్రాద్రి కొత్తగూడెం 89
జిహెచ్ఎంసీ 452
జగిత్యాల 88
జనగామ 41
జయశంకర్ భూపాలపల్లి 26
జోగులాంబ గద్వాల 33
కామారెడ్డి 62
కరీంనగర్ 164
ఖమ్మం 157
కొమరంభీమ్ ఆసిఫాబాద్ 19
మహబూబ్ నగర్ 42
మహబూబాబాద్ 62
మంచిర్యాల 71
మెదక్ 35
మేడ్చెల్ మల్కాజిరిగి 129
ములుగు 18
నాగర్ కర్నూలు 41
నల్లగొండ 157
నారాయణపేట 21
నిర్మల్ 16
నిజామాబాద్ 97
పెద్దపల్లి 75
రాజన్న సిరిసిల్ల 53
రంగారెడ్డి 216
సంగారెడ్డి 76
సిద్ధిపేట 120
సూర్యాపేట 116
వికారాబాద్ 27
వనపర్తి 45
వరంగల్ రూరల్ 46
వరంగల్ ఆర్బన్ 114
యాదాద్రి భువనగిరి 73
మొత్తం కేసులు 2817
Media Bulletin on status of positive cases in Telangana. (Dated. 03.09.2020) pic.twitter.com/qOAskusytK
— Dr G Srinivasa Rao (@drgsrao)