ములుగు జిల్లా వెంకటాపురం ( కె) మండలం సూరువీడు గ్రామ మాజీ సర్పంచ్ రమేష్ ను మావోయిస్టులు హత్య చేశారు. పోలీస్ ఇన్‌ఫార్మర్ గా వ్యవహరిస్తున్నారని మావోయిస్టులు ఆరోపించారు. ఈ మేరకు డెడ్ బాడీ వద్ద మావోయిస్టులు లేఖను వదిలి వెళ్లారు.
ములుగు: ములుగు జిల్లా వెంకటాపురం (కె) మండలం సూరువీడు గ్రామ మాజీ సర్పంచ్ రమేష్ ను మావోయిస్టులు హత్య చేశారు.ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలో రమేష్ మృతదేహన్ని మావోయిస్టులు వదిలి వెళ్లారు. పోలీస్ ఇన్‌ఫార్మర్ గా వ్యవహరిస్తున్నాడని రమేష్ మృతదేహం వద్ద మావోయిస్టులు లేఖను వదిలి వెళ్లారు. రెండు రోజుల క్రితం రమేష్ ను మావోయిస్టులు కిడ్నాప్ చేశారు.కురుసం Ramesh ను Maoist సోమవారం రాత్రి mulugu district వెంకటాపురం (కె) మండలం సూరువీడు పంచాయతీ కె కొండాపురం వద్ద Kidnap చేశారు.
రమేశ్ 2014లో Congressపార్టీ నుంచి సర్పంచ్‌గా గెలిచారు. ఆ తర్వాత రమేశ్ భార్య Rajithaకు ఏటూరునాగారం సామాజిక ఆస్పత్రిలో ఏఎన్‌ఎం ఉద్యోగం రావడంతో ఏటూరునాగారం మండల కేంద్రంలోని ఐటీడీఏ క్వార్టర్స్ సమీపంలో నివాసం ఉంటున్నారు.రమేష్ Auto driver గా పనిచేస్తున్నాడు. రమేష్ గతంలో మావోయిస్టులకు కొరియర్ గా పనిచేశాడగు. అయితే అదే సమయంలో పోలీస్ ఇన్ ఫార్మర్ గా పనిచేస్తున్నాడని మావోయిస్టులు ఆయనపై ఆరోపణలు చేస్తున్నారు. ఇటీవల కాలంలో ఈ ప్రాంతంలో జరిగిన ఆయడేెయొాి కు రమేష్ బాధ్యుడిగా మావోయిస్టులు ఆరోపిస్తున్నారు. అంతేకాదు ఓ మావోయిస్టు నేతకు విషాహారం పెట్టి అతని మరణానికి కారణమని మావోయిస్టులు ఆ లేఖలో ఆరోపించారు. ఈ విషయమై చత్తీష్‌ఘడ్, తెలంగాణ సరిహద్దుల్లో ప్రజా కోర్టు నిర్వహించి రమేష్ చేసిన తప్పులను ఎత్తి చూపి ప్రజా కోర్టులో అతడిని మావోయిస్టులు హత్య చేశారు.
also read:మాజీ సర్పంచ్ అదృశ్యం.. మన్నించి వదిలేయండి.. మావోయిస్టులకు భార్య విజ్ఞప్తులు
గతంలో కూడా ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో ప్రజా కోర్టులను నిర్వహించి రాజకీయ నేతలను,పోలీస్ ఇన్ ఫార్మర్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలతో హత్యలు చేసిన ఘటనలున్నాయి. అయితే మావోయిస్టుల ఉనికి తగ్గిన నేపథ్యంలో ఈ తరహ ఘటనలు తగ్గాయి. అయితే ఛత్తీష్ ఘడ్ రాష్ట్రంలో ఈ తరహ ఘటనలు సాగుతున్నాయనే వార్తలు వస్తున్నాయి. ఛత్తీష్ ఘడ్ రాష్ట్రానికి సరిహద్దులో ఉన్న తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాల్లో పట్టును పెంచుకొనేందుకు మావోయిస్టులు ప్రయత్నాలు చేస్తున్నారు గత ఏడాది నుండి మావోయిస్టులు రిక్రూట్ మెంట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారని పోలీసులు గుర్తించారు. ఈ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కూంబింగ్ లు నిర్వహించే క్రమంలో ఎన్ కౌంటర్లు చోటు చేసుకొన్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎన్ కౌంటర్లు జరిగాయి.అయితే తాజాగా ములుగు జిల్లాలో చోటు చేసుకొన్న ఘటన మరోసారి మావోయిస్టుల ఉనికి రమేష్ హత్యతో వెలుగు చూసింది.