వరి ధాన్యం ఇష్యూ: తెలంగాణ మంత్రులపై పీయూష్ వ్యాఖ్యలు... క్షమాపణకు హరీష్ రావు

By narsimha lode  |  First Published Dec 22, 2021, 11:41 AM IST

రాష్ట్ర మంత్రులకు పని లేదా అంటూ అవమానపర్చేలా మాట్లాడిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ క్షమాపణ చెప్పాలని తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు.  ఎంత ప్రాధాన్యత ఉంటే ఆరుగురు మంత్రులు ఢిల్లీలో ఉంటారని మంత్రి ప్రశ్నించారు.


సంగారెడ్డి: తెలంగాణ మంత్రులపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి Harish Rao డిమాండ్ చేశారు. అంతేకాదు Telangana ప్రజలకు క్షమాపణలు చెప్పాలని కూడా ఆయన డిమాండ్ చేశారు మంగళవారం నాడు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలంగాణ మంత్రులపై చేసిన వ్యాఖ్యలపై హరీష్ రావు స్పందించారు.బుధవారం నాడు మంత్రి హరీష్ రావు సంగారెడ్డిలో మీడియాతో మాట్లాడారు.Piyush Goyal  వ్యాఖ్యలు అత్యంత దుర్మార్గంగా ఉన్నాయన్నారు. Paddy ధాన్యం కొనుగోలు అంశానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వమే రాజకీయం చేస్తోందని మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. ఇంత దుర్మార్గంగా మాట్లాడే హక్కు పీయూష్ గోయల్ కు ఎక్కడిదని ఆయన ప్రశ్నించారు. మీకు రాజకీయాలు ముఖ్యం కావొచ్చు... కానీ మాకు మా రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని హరీష్ రావు తేల్చి చెప్పారు. తమ మంత్రులను కలవడానికి సమయం ఉండదు, కానీ బీజేపీ నేతలకు మాత్రం వెంటనే సమయం ఇస్తారా అని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ను హరీష్ రావు ప్రశ్నించారు.మంత్రులను పట్టుకొని పని లేదా అంటారా అని హరీష్ రావు ప్రశ్నించారు. రాష్ట్రం నుండి అధికారుల బృందం వస్తే కలవకుండా రాజకీయం చేసింది మీరు కాదా అని పీయూష్ గోయల్ ను నిలదీశారు హరీష్ రావు.ఎంత ప్రాధాన్యత ఉంటే ఆరుగురు మంత్రులు ఢిల్లీకి వస్తారో అర్ధం చేసుకోవాలన్నారు.

also read:వరి ధాన్యం ఇష్యూ: కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌తో తెలంగాణ మంత్రులు భేటీ

Latest Videos

undefined

ఒక ఓటు రెండు రాష్ట్రాలని చెప్పి మధ్యలోనే ఆ నినాదాన్ని వదిలేసింది Bjp యేనని మంత్రి హరీష్  రావు గుర్తు చేశారు.Punjab  రాష్ట్రంలో కొనుగోలు చేస్తున్నట్టుగానే తమ రాష్ట్రంలో కూడా వరి ధాన్యం మొత్తం కొనుగోలు చేయాలని తాము డిమాండ్ చేస్తున్నామని హరీష్ రావు చెప్పారు. వరి ధాన్యం కొనుగోలు అంశాన్ని కేంద్రం ఎందుకు తమ చేతుల్లోనే ఉంచుకొందో చెప్పాలన్నారు. వరి ధాన్యం కొనుగోలును రాష్ట్రాలకు అప్పగించాలని మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు.దేశమంతా వరి ధాన్యం కొనుగోలుపై  ఒకే విధానం ఉండాలని ఆయన  డిమాండ్ చేశారు.  

తమక అవసరం ఉన్న సమయంలో మెడమీద కత్తి పెట్టి వరి ధాన్యం తీసుకోలేదా అని కేంద్ర మంత్రిని హరీష్ రావు ప్రశ్నించారు.రాష్ట్రం నుండి బియ్యం సరఫరా కోసం అవసరమైన రైల్వే వ్యాగన్లు ఏర్పాటు చేయాలని పదే పదే కోరినా కూడా కేంద్రం నుండి స్పందన లేదని మంత్రి హరీష్ రావు చెప్పారు. కేంద్ర ప్రభుత్వానికి రాసిన లేఖలను మంత్రి హరీష్ రావు మీడియా సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున రాసిన లేఖలను మంత్రి హరీష్ రావు మీడియాకు చూపించారు.వరి ధాన్యం కొనుగోలు అంశానికి సంబంధించి రాష్ట్ర మంత్రులకు పీయూష్ గోయల్ మంగళవారం నాడు మధ్యాహ్నం అపాయింట్ మెంట్ ఇచ్చారు. అంతకు ముందే రాష్ట్రానికి చెందిన బీజేపీ నేతలకు అపాయింట్ మెంట్ ఇచ్చారు. బీజేపీ నేతలతో సమావేశమైన తర్వాత రాష్ట్ర ప్రభుత్వంతో పాటు, మంత్రులపై పీయూష్ గోయల్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ మంత్రులకు పని లేదా అని ప్రశ్నించారు. వారిని మేం రావాలని  ఆహ్వానించలేదన్నారు. మా పనులు మాకుున్నాయని పీయూష్ గోయల్ వ్యాఖ్యలు చేశారు.


 

click me!