వేముల ప్రశాంత్ రెడ్డి మాటల్లో తప్పు లేదు: జగన్ ప్రభుత్వంపై పువ్వాడ అజయ్ ఫైర్

By telugu teamFirst Published Jun 26, 2021, 10:54 AM IST
Highlights

కృష్ణానదీ జలాల వివాదంపై తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ ఏపీ సీఎం వైెెఎస్ జగన్ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఏపీ ప్రభుత్వంపై తమ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్లో తప్పేమీ లేదని ఆయన అన్నారు.

హైదరాబాద్:  కృష్ణా నదీ జలాల వివాదంపై తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు. తమ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్లో తప్పేమీలేదని సమర్థించారు. ఏపీ ప్రభుత్వం చేపట్టిన పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు అక్రమమేనని ఆయన అన్నారు. 

పనులు అపుతామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పి కూడా మాట తప్పిందని ఆయన విమర్శించారు. ఎన్జీటీ తీర్పులను కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గౌరవించడం లేదని అన్నారు. ఇరు రాష్ట్రాల కృష్ణా నదీ జలాల వాటాను కేంద్రం ప్రభు్తవం తీర్చాలని ఆయన డిమాండ్ చేశారు. 

తెలంాగణ కాంగ్రెసు శాసనసభా పక్షం (సిఎల్పీ) నేత మల్లుభట్టి విక్రమార్క నిజానిజాలు తెలుసుకుని మాట్లాడాలని ఆయన సూచించారు. తమకు అన్యాయం చేయాలని చూస్తే ఊరుకునేది లేదని ఆయన ఏపీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తమ రాష్ట్రానికి ఏపీ ప్రభుత్వం అన్యాయం చేయాలని చూస్తోందని ఆయన అన్నారు. తెలంగాణ వాటాకు ఏపీ ప్రభుత్వం గండి కొడుతోందని ఆయన అన్నారు.

పోతిరెడ్డిపాడు అంశంపై తెలంగాణ ఉద్యమం సందర్భంగా ఆనాడే కేసీఆర్ పోరాటం చేశారని అజయ్ చెప్పారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమనీళ్ల తరలింపు పరాకాష్టకు చేరిందని మండిపడ్డారు. కేంద్రానికి అబద్ధాలు చెప్తూ ఏపీ ప్రభుత్వం అక్రమంగా ప్రాజెక్టులు నిర్మిస్తోందని ఆయన విమర్శించారు.
 
బీజేపీ నేతలు ఏపీలో ఒకలా మాట్లాడితే తెలంగాణలో మరోలా మాట్లాడుతున్నారని ఆయన తప్పు పట్టారు. ఆనాడు నీటి పంపకాలలో కేసీఆర్ లేడు- ఇందిరా గాంధీ పీఎంగా ఉన్నారని ఆయన చెప్పారు. తెలంగాణ పట్ల తండ్రికి మించిన తనయుడు జగన్మోహన్ రెడ్డి అని ఆయన వ్యాఖ్యానించారు.

ఆనాడే వైఎస్సార్ తెలంగాణ లో ఒకలా/ ఏపీలో మరోలా మాట్లాడి తెలంగాణ సమాజాన్ని చిన్నచూపు చూశారని ఆయన విమర్శించారు. కేంద్రంలో అధికార బీజేపీ సన్నాయి నొక్కులు నొక్కుతోందని అన్నారు. రెండు రాష్ట్రాల ప్రజల బాగు కోసం కేసీఆర్ రాయలసీమకు నీళ్లు ఇస్తాం అనే మాటలను ఏపీ నేతలు వక్రీకరిస్తున్నారని చెప్పారు.

ట్రిబ్యునల్ లో రెండు రాష్ట్రాల నీటి వాటాలను ఇంకా తేలలేదని,  తెలంగాణ నుంచి అక్రమంగా 7 మండలాలలో పోలవరం కట్టి ఒక్క ఏకరానికి నీళ్లు రావడం లేదని ఆయన అన్నారు.  వైఎస్సార్ విషయంలో వేముల ప్రశాంత్ రెడ్డి మాటలు వందశాతం నిజమని అజయ్ అన్నారు. తెలంగాణ ప్రజల హక్కుల కోసం తాము మాట్లాడుతున్నామని, ఇది తమ హీరోయిజం కోసం కాదని అజయ్ అన్నారు.

ఆంధ్రప్రేదేశ్ ప్రభుత్వం తలపెట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం అక్రమమని మరో తెలంగాణ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. ఆ ప్రాజెక్టు ముందుకు సాగకుండా తాము అన్ని చర్యలూ తీసుకుంటామని ఆయన చెప్పారు.

click me!