వుమెన్స్ డే ను ఘనంగా నిర్వహించిన మావోలు

Published : Mar 08, 2017, 12:45 PM ISTUpdated : Mar 25, 2018, 11:45 PM IST
వుమెన్స్ డే ను ఘనంగా నిర్వహించిన మావోలు

సారాంశం

మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ రోజు ఆంధ్రా, తెలంగాణ సరిహద్దులోని సుక్మా జిల్లాలోని దండకారణ్య పరిసరాల్లో మావోయిస్టులు మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు.

అంతర్జాతీయంగా మహిళా దినోవత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. భారత్ లో కూడా వుమెన్స్ డే ను చాలా రాష్ట్రాలు అధికారక కార్యక్రమంగా జరుపుతున్నారు. మహిళాదినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

 

తెలంగాణ ప్రభుత్వం గతేడాది నుంచి మార్చి 8 న మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ రంగాలలో కృషి చేసిన మహిళలను ఘనంగా సత్కరిస్తుంది. ఈ విషయాలు అందరికీ తెలిసినవే.

 

చాలా మందికి తెలియని విషయం ఏంటంటే  కీకారణ్యంలో తుపాకులు పట్టే మావోయిస్టులు కూడా వుమెన్స్ డే ను ఘనంగా నిర్వహిస్తున్నారు.

 

గత రెండేళ్ల నుంచి మహిళా దినోత్సవాన్ని ఓ ఆనవాయితా మావోలు జరుపుతున్నట్లు తెలిసింది.

 

మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ రోజు ఆంధ్రా, తెలంగాణ సరిహద్దులోని సుక్మా జిల్లాలోని దండకారణ్య పరిసరాల్లో మావోయిస్టులు మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు.

 

మహిళా దళ కమాండర్ల నేతృత్వంలో ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. జన చేతన నాట్య మండలి కళాకారులు పాటలు , నృత్యాలతో ఉత్సాహంగా వేడుకలు నిర్వహించారు.

 

ఈ వేడుకల్లో పలువురు మావోయిస్టు అగ్రనేతలు పాల్గొన్నట్లు సమాచారం. మహిళలకు సమాన హక్కులు, అవకాశాలు దక్కాలని మావోయిస్టు ఈ సందర్భంగా తమ కేడర్ కు ఉద్బోవించారట.

 

అంతేకాదు మహిళా దినోత్సవ కానుకగా మావోయిస్టు పార్టీలో పెద్ద ఏరియాల దళ కమాండర్ బాధ్యతలను ఇకపై మహిళలకూ ఇవ్వాలని నిర్ణయించారట.

PREV
click me!

Recommended Stories

Top 10 Law Colleges in India : ఈ హైదరాబాద్ లా కాలేజీలో చదివితే.. సుప్రీం, హైకోర్టుల్లో లాయర్ పక్కా
Christmas Holidays : ఓరోజు ముందుగానే క్రిస్మస్ సెలవులు.. ఎప్పటివరకో తెలిస్తే ఎగిరిగంతేస్తారు..!