ఎంతో ప్రేమతో పెంచా, జీర్ణించుకోలేకపోయా: మనోహరాచారి

Published : Sep 20, 2018, 07:34 AM IST
ఎంతో ప్రేమతో పెంచా, జీర్ణించుకోలేకపోయా: మనోహరాచారి

సారాంశం

తమను కాదని ప్రేమ పెళ్లి చేసుకుందనే ఆవేశంతో తన కూతురిపై దాడి చేసినట్లు మాధవి తండ్రి మనోహరాచారి తెలిపాడు. హైదరాబాదులోని ఎర్రగడ్డలో కూతురు మాధవి, ఆమె భర్త సందీప్ పై మనోహరాచారి దాడి చేసిన విషయం తెలిసిందే. 

హైదరాబాద్: తమను కాదని ప్రేమ పెళ్లి చేసుకుందనే ఆవేశంతో తన కూతురిపై దాడి చేసినట్లు మాధవి తండ్రి మనోహరాచారి తెలిపాడు. హైదరాబాదులోని ఎర్రగడ్డలో కూతురు మాధవి, ఆమె భర్త సందీప్ పై మనోహరాచారి దాడి చేసిన విషయం తెలిసిందే. మనోహరాచారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనిపై కేసు నమోదుచేసి విచారణ చేపట్టారు. 

పోలీసుల దర్యాప్తులో మనోహరరావు కీలక విషయాలు వెల్లడించాడు. ఎంతో ప్రేమగా పెంచుకున్న తన కూతురు ప్రేమ వివాహం చేసుకోవడం ఏమాత్రం ఇష్టం లేదని పోలీసుల విచారణలో మనోహరాచారి తెలిపాడు. వారి వివాహాన్ని జీర్ణించుకోలేకపోయానని, ఐదు రోజులుగా మద్యం సేవిస్తూనే ఉన్నానని చెప్పాడు. 

తన కూతురికి రెండేళ్ల వయస్సు ఉన్నప్పుడు నగరానికి వచ్చానని, అప్పటి నుంచి అమీర్‌పేటలో ఓ జ్యూయలరీ షాపులో పనిచేస్తున్నానని అన్నాడు. 

మనోహరాచారి టార్గెట్ అతని కూతురు మాధవేనని వెస్ట్ జోన్ డీసీపీ శ్రీనివాస్ వెల్లడించారు. సందీప్‌ను చంపాలనే ఉద్దేశం తనకు లేదని మనోహరాచారి చెప్పినట్లు తెలిపారు. ప్రేమ పెళ్లిని తట్టుకోలేక కూతురుపై కక్ష పెంచుకొని దాడికి  పాల్పడ్డాడని చెప్పారు.

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్