మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సెక్యూరిటీ తగ్గింపు: ఎస్కార్ట్ వాహనం తొలగింపు

By narsimha lode  |  First Published Jan 4, 2023, 4:47 PM IST

మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సెక్యూరిటీ తగ్గించారు.  గతంలో  ఉన్న  గన్ మెన్లను కుదించారు. ఎస్కార్ట్ వాహనం కూడ  తొలగించారు. 


హైదరాబాద్: మాజీ ఎంపీ పొంగులేటి  శ్రీనివాస్ రెడ్డికి  సెక్యూరిటీని తగ్గించారు. గతంలో  ఆయనకు  3+3  గన్ మెన్లు ఉండేవారు. ప్రస్తుతం  ఆయన గన్ మెన్లను  2+2కి కుదించారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి  క్యాంప్ కార్యాలయం వద్ద  పైలెట్ సెక్యూరిటీని కూడ తొలగించారు. ఈ నెల  1వ తేదీన  పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి  ఆత్మీయ సమ్మేళంన నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా  పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి చెందిన  అభిమానులు,సన్నిహితులు, బీఆర్ఎస్ కార్యకర్తలు ఈ సమ్మేళనంో పాల్గొన్నారు.ఈ సమ్మేళనంలో  పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.   వచ్చే ఎన్నికల్లో తన  అనుచరులంతా  పోటీ చేస్తారని స్పష్టం చేశారు. సమయం వచ్చినప్పుడు అన్ని విషయాలు చెబుతానన్నారు. అదే రోజున మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా  తన  ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. తన స్వగ్రామం బారెగూడెంలో తుమ్మల నాగేశ్వరరావు నిర్వహించిన  ఆత్మీయ సమ్మేళనానికి  ఆయన వర్గానికి చెందిన వారు కూడా హాజరయ్యారు.

కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకొని  ఒకే పార్టీకి చెందిన ఇరువురు నేతలు  ఆత్మీయ సమ్మేళనం నిర్వహించడం  ప్రాధాన్యత సంతరించుకుంది. 2014 ఎన్నికల్లో ఖమ్మం నుండి వైసీపీ అభ్యర్ధిగా  పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పోటీ చేసి విజయం సాధించారు.  ఆ తర్వాత  జరిగిన పరిణామాల నేపథ్యంలో  పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి  వైసీపీని వీడి బీఆర్ఎస్ లో చేరారు. 2019 ఎన్నికల్లో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి  బీఆర్ఎస్ టికెట్ ఇవ్వలేదు.2019 ఎన్నికల్లో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి  బీఆర్ఎస్ టికెట్ ఇవ్వలేదు.

Latest Videos

also read:వచ్చే ఎన్నికల్లో నా అనుచరులంతా పోటీ: ఆత్మీయ సమ్మేళనంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచలనం

2018  ఎన్నికల్లో   జిల్లాలోని బీఆర్ఎస్ అభ్యర్ధుల ఓటమికి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి  కారణమనే ఆరోపణలు అప్పట్లో  వచ్చాయి.ఈ ఆరోపణలను ఆయన  తోసిపుచ్చారు.  ఆ తర్వాత  పరిణామాలల్లో  కొన్ని పదవులు ఇస్తారనే ప్రచారం సాగింది.  కానీ   పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి పదవులు  ఇవ్వలేదు. కొంత కాలంగా  పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి  పార్టీ మారుతారని ప్రచారం సాగింది.  కానీ  పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ లోనే  కొనసాగారు.  పార్టీ మారడం లేదని  స్పష్టం చేశారు.ఈ నెల  1వ తేదీన  ఆత్మీయ సమ్మేళనంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి  చేసిన వ్యాఖ్యలు  చర్చకు దారితీశాయి.  ఈ వ్యాఖ్యలు చేసిన  మూడు రోజులకే  పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కి సెక్యూరిటీ  తగ్గించడం కలకలం రేపుతుంది. 


 

click me!