మాధవి కేసులో మందకృష్ణ మాదిగ అనుమానం ఏంటంటే

By Nagaraju TFirst Published 20, Sep 2018, 8:30 PM IST
Highlights

మాధవి, సందీప్ లపై మనోహరాచారి అత్యంత పాశవికంగా దాడి చేస్తే మద్యం మత్తులో హత్యాయత్నం చేశాడని డీసీపీ శ్రీనివాస్ ఎలా చెప్తారని మందకృష్ణ మాదిగ ప్రశ్నించారు. ప్రేమ వివాహం చేసుకున్నందుకు తండ్రి చేతిలో దాడికి గురైన మాధవిని మందకృష్ణ మాదిగ పరామర్శించారు. డీసీపీ స్టేట్ మెంట్ పై మందకృష్ణ మాదిగ అనుమానం వ్యక్తం చేశారు. 

హైదరాబాద్‌ : మాధవి, సందీప్ లపై మనోహరాచారి అత్యంత పాశవికంగా దాడి చేస్తే మద్యం మత్తులో హత్యాయత్నం చేశాడని డీసీపీ శ్రీనివాస్ ఎలా చెప్తారని మందకృష్ణ మాదిగ ప్రశ్నించారు. ప్రేమ వివాహం చేసుకున్నందుకు తండ్రి చేతిలో దాడికి గురైన మాధవిని మందకృష్ణ మాదిగ పరామర్శించారు. డీసీపీ స్టేట్ మెంట్ పై మందకృష్ణ మాదిగ అనుమానం వ్యక్తం చేశారు. 

ఐసీయూలో చికిత్స పొందుతున్న ఆమెతో మాట్లాడారు. మాధవి ప్రస్తుతం క్షేమంగా ఉందని, ప్రస్తుతం ఆమె చాలా ధైర్యంగా ఉందని తెలిపారు. తల్లి, తమ్ముడిని చూడాలని ఉందంటూ అడిగిందని తెలిపారు. ఆ తర్వాత  మాధవికి శస్త్రచికిత్స చేసిన డా.యోగేష్, డా.సునీల్ లను ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మాధవికి వైద్యం అందించినందుకు ఆస్పత్రి యాజమాన్యానికి, వైద్య బృందానికి ఆయన కృతఙ్ఞతలు తెలిపారు.

మిర్యాలగూడలో ప్రణయ్‌ హత్యపై దేశం మొత్తం స్పందిస్తే కేసీఆర్ మాత్రం స్పందించలేదని మందకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రణయ్‌, మాధవిల కుటుంబాలకు ప్రభుత్వం ఎలాంటి భరోసా ఇవ్వలేదని మండిపడ్డారు. ప్రభుత్వం ఇటువంటి ఘటనలపై స్పందించకపోతే శాంతి భద్రతలు ఎక్కడికి పోతాయంటూ ప్రశ్నించారు. 24 గంటల్లో ఈ ఘటనలపై కేసీఆర్‌ తన వైఖరి తెలపకపోతే 48 గంటల్లో రాష్ట్రపతి పాలన విధించాలంటూ డిమాండ్‌ చేశారు.

మరోవైపు మాధవిపై అత్యంత పాశవికంగా దాడి జరిగితే మనోహరాచారి మద్యం మత్తులో హత్యాయత్నం చేశాడని డీసీపీ శ్రీనివాస్ ఎలా చెబుతారని మందకృష్ణ మాదిగ ప్రశ్నించారు. డీసీపీ స్టేట్‌మెంట్‌ చూస్తుంటే నిందితుడిని రక్షించే ప్రయత్నం చేస్తున్నట్టుగా ఉందని ఆరోపించారు.

Last Updated 20, Sep 2018, 8:33 PM IST