తెలంగాణకు కుంతియా శనిలా దాపురించాడు : కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

By Arun Kumar PFirst Published Sep 20, 2018, 7:51 PM IST
Highlights

తెలంగాణ కాంగ్రెస్‌లొ పిసిసి కమిటీల చిచ్చు కొనసాగుతోంది. ఈ కమిటీల ఏర్పాటులో ప్రాధాన్యం దక్కని సీనియర్లు కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వంపై బహిరంగంగా విమర్శలకు దిగుతున్నారు. ఇప్పటికే సీనియర్లు హన్మంతరావు, పొంగులేటి, డికె. అరుణ, సుధీర్ రెడ్డి తమ అసంతృప్తిని వ్యక్తపర్చగా తాజాగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా అసంతృప్తుల జాబితాలో చేరిపోయాడు. ఇతడు ఏకంగా తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి కుంతియానే టార్గెట్ గా చేసుకుని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.

తెలంగాణ కాంగ్రెస్‌కు కుంతియా ఓ శనిలా దాపురించాడంటూ ఘాటుగా విమర్శించాడు. తాను ఈ కమిటీల ఏర్పాటుపై ఇప్పటికే కుంతియాను ఫోన్ లో నిలదీసినట్లు రాజగోపాల్ రెడ్డి తెలిపారు. తానే ఎవరికీ భయపడనని, ఎవరి ముందూ తలవంచే స్వభావం కాదని రాజగోపాల్ రెడ్డి చెప్పుకొచ్చారు. అందువల్లే ఇంత నిక్కచ్చిగా మాట్లాడుతున్నట్లు తెలిపారు.

కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన కమిటీల్లో బ్రోకర్లకు అధిక ప్రాధాన్యత కల్పించారని అన్నారు. పైరవీకారులకు పదవులివ్వడం వల్ల పార్టీ అధికారంలోకి రాదని ఆయన అధిష్టానానికి సూచించారు. ఇలా పార్టీ కోసం పనిచేయని వాళ్లకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం వల్లే కాంగ్రెస్ కు ఈ గతి పట్టిందని విమర్శించారు. ఇకపైనా పనిచేసే వాళ్లను గుర్తిస్తే మంచిదని రాజగోపాల్ రెడ్డి సూచించారు.

అయితే రాజగోపాల్ రెడ్డి అన్న వెంకట్ రెడ్డి మాత్రం తనకు కమిటీలో మంచి అవకాశం కల్పించారని...అందకు కాంగ్రెస్ పార్టీకి దన్యవాదాలు తెలిపిన విషయం తెలిసిందే. మ్యానిపెస్టో కమిటీలో సభ్యునిగా తనకు అవకాశం కల్పించడం పట్ల సంతృప్తిగా వున్నట్లు వెంకట్ రెడ్డి ఇదివరకే ప్రకటించారు.  అయితే రాజగోపాల్ రెడ్డి తాజా వ్యాఖ్యలపై పార్టీలోనే కాదు తెలంగాణ రాజకీయాల్లో చర్చ జరుగుతోంది.  
 
click me!