మాధవి కోలుకుంటోంది: వైద్యులు

By Nagaraju TFirst Published Sep 20, 2018, 7:20 PM IST
Highlights

తండ్రి చేతిలో దాడికి గురై చికిత్స పొందుతున్న మాధవి ప్రాణగండం తప్పిందని వైద్యులు స్పష్టం చేశారు. సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న మాధవికి సంబంధించి వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. మాధవి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు ప్రకటించారు.

హైదరాబాద్: తండ్రి చేతిలో దాడికి గురై చికిత్స పొందుతున్న మాధవి ప్రాణగండం తప్పిందని వైద్యులు స్పష్టం చేశారు. సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న మాధవికి సంబంధించి వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. మాధవి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు ప్రకటించారు. 

వైద్యానికి మాధవి శరీరంసహకరిస్తోందని తెలిపారు. వెంటిలేషన్ తొలగించామన్నారు. ప్రస్తుతం మాధవి మాట్లాడుతోందని వైద్యులు వెల్లడించారు. అలాగే బీపీ కూడా అదుపులో ఉందని స్పష్టం చేశారు. నిన్నటితో పోల్చితే మాధవి ఆరోగ్యం మెరుగ్గా ఉందని పేర్కొన్నారు. 48 గంటల తర్వాత జనరల్ వార్డుకు తరలిస్తామని యశోదా వైద్యులు స్పష్టం చేశారు. 
వెంటిటేటర్‌పై మాధవికి చికిత్స అందిస్తున్నట్టు డాక్టర్లు ప్రకటించారు.

తీవ్ర గాయాలపాలైన మాధవికి ఉదయం వైద్యులు 8గంటల పాటు శ్రమించి శస్త్రచికిత్స పూర్తి చేశారు. మాధవి శరీరం నుండి తీవ్ర రక్తస్రావం జరిగడంతో ఆరుబాటిళ్ల రక్తం ఎక్కించినట్లు వైద్యులు స్పష్టం చేశారు. రక్తస్రావాన్ని అరికట్టి చికిత్స చేసినట్టు తెలిపారు. చేయి పూర్తిగా తెగిపోవడంతో రాడ్స్ వేసి సరిచేసినట్టు వైద్యులు ప్రకటించారు.

మెడపై తీవ్ర గాయమవ్వడంతో మెదడుకు వేళ్ళే నరాలు దెబ్బతిన్నాయని అయితే వాటిని తిరిగి యథావిధిగా పనిచేసేలా శస్త్ర చికిత్స చేసినట్టు డాక్టర్లు ప్రకటించారు. మెదడుకు వెన్నుముకకు ఎలాంటి ప్రమాదం లేదన్నారు.

click me!