కరీంనగర్లో కల్పనా హోటల్ ఎదురుగా మద్యం మత్తులో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తుల మధ్య రాళ్లతో ఘర్షణ జరిగింది. అందులో ఒకరు మృతి చెందగా ఇంకొకరు పోలీస్ ల అదుపులో ఉన్నారు.
కరీంనగర్ : కరీంనగర్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా దారుణ ఘటన చోటు చేసుకుంది. పీఎస్ ఎదురుగా ఉన్న మద్యం దుకాణం ఎదుట యువకుడి దారుణ హత్య సంచలనం సృష్టించింది. మత్తులో ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన గలాటాలో ఒంగోలుకు చెందిన పులగందల సిసింద్రీ(26) మృతి చెందాడు.
గురువారం అర్ధరాత్రి పర్మిట్ రూంలో పీకల దాకా తాగిన ఇద్దరు వ్యక్తుల మధ్య నెలకొన్న వివాదం ఈ సంఘటకు దారితీసింది. ఒంగోలుకు చెందిన సిసింద్రీ హౌసింగ్ బోర్డ్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. మద్యం కొనుగోలు సమయంలో బొమ్మకల్ కు చెందిన లారీ డ్రైవర్ జూపల్లి దత్తారావుతో గొడవ ప్రారంభమైంది.
గొడవ కాస్త ముదురుడంతో దత్తారావు సిసింద్రీ తలపై బండరాయితో బలంగా బాధడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న కరీంనగర్ టౌన్ ఏసిపి గోపతి నరేందర్ తో పాటు అధికారులు, సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. దీనిమీద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.