గ్రామ కార్యదర్శి పై లైంగిక దాడికి యత్నం..!

Published : Jun 11, 2021, 08:45 AM IST
గ్రామ కార్యదర్శి పై లైంగిక దాడికి యత్నం..!

సారాంశం

పింఛన్‌ డబ్బును అందజేసేందుకు 10రోజుల క్రితం ఆమె ఇంటికి వెళ్లిన సదరు కార్యదర్శి.. ఆమెపై లైంగికదాడికి యత్నించాడు.

ఒంటరిగా నివసిస్తున్న ఓ మహిళా గ్రామ కార్యదర్శి పై మరో గ్రామ కార్యదర్శి లైంగిక దాడికి యత్నించారు. ఈ విషయమై ఆమె అధికారులకు ఫిర్యాదు చేయగా.. ఎవరూ పట్టించుకోకపోవడం గమనార్హం.

లైంగిక దాడి కార్యాలయంలో జరగలేదు కదా అని అధికారులు ఆమెను ఎదురు ప్రశ్నించడం గమనార్హం. అంతేకాకుండా.. ఆమెపై దాడికి యత్నించిన.. గ్రామ కార్యదర్శి చాలా మంచివాడంటూ కితాబు ఇవ్వడం విశేషం. ఈ సంగటన సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో పది రోజుల క్రితం జరగగా... ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

 మండల పరిధిలోని ఓ మహిళా గ్రామ కార్యదర్శి... భర్తకు దూరంగా ఉంటూ కుమార్తెతో కలిసి నివసిస్తోంది. పింఛన్‌ డబ్బును అందజేసేందుకు 10రోజుల క్రితం ఆమె ఇంటికి వెళ్లిన సదరు కార్యదర్శి.. ఆమెపై లైంగికదాడికి యత్నించాడు.

ఘటనపై అదేరోజు ఆమె అధికారులకు ఫిర్యాదు చేయగా..వారు పట్టించుకోలేదు. పోలీసులకు ఫిర్యాదు చేయాలంటూ చేతులు దులుపుకొన్నారు. బాధిత మహిళ స్థానిక నాయకుల దృష్టికి తీసుకెళ్లగా.. వారు అతడిని హెచ్చరించినట్లు తెలిసింది. ఇదిలా ఉండగా, హుజూర్‌నగర్‌ మండల పరిషత్‌లోని ఓ మహిళా ఉద్యోగి పట్ల సహోద్యోగి అసభ్యంగా ప్రవర్తించగా, ఆమె కుటుంబ సభ్యులు అతడిని చితకబాదారు. దీంతో అతడు ఆమె కాళ్లు పట్టుకుని క్షమాపణ చెప్పినట్లు తెలిసింది.
 

PREV
click me!

Recommended Stories

చైనీస్ మాంజాపై సజ్జనార్ కొరడా | Sajjanar Strong Warning on Chinese Manja Sales | Asianet News Telugu
Invite KCR To Medaram Jatara: కేసీఆర్ కు మేడారం ఆహ్వాన పత్రిక అందజేసిన మంత్రులు| Asianet News Telugu