భార్య తన మాట వినడం లేదని.. భర్త ఏం చేశాడంటే...

Published : Jun 10, 2020, 10:51 AM ISTUpdated : Jun 10, 2020, 10:54 AM IST
భార్య తన మాట వినడం లేదని.. భర్త ఏం చేశాడంటే...

సారాంశం

మద్యం సేవించి భార్య తన మాట వినటం లేదని ఇంట్లోనే చనిపోతానని గొడవ పెట్టుకున్నాడు. అదే కోపంతో కాశీరాం బయటకు వచ్చి అక్కడే ఉన్న వాటర్‌ ట్యాంక్‌ ఎక్కి చనిపోతానని బెదిరించాడు.

భార్య తన మాట వినడం లేదని.. తనను అసలు లెక్క చేయడం లేదని ఓ భర్త మనస్థాపానికి గురయ్యాడు.  దీంతో.. తమ గ్రామంలోని వాటర్ ట్యాంకర్ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరించాడు. ఈ వింత సంఘటన నిజామాబాద్ జిల్లా దర్పల్లి గోసంగి కాలనీలో చోటుచేసుకోగా పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

 ధర్పల్లి గోసంగి కాలనీకి చెందిన చిత్తడి కాశీరాం, సాయమ్మ దంపతులు తరుచూ గొడవ పడేవారు. చిన్న గొడవ పెద్దదిగా మారి భర్త కాశీరాం మంగళవారం  మద్యం సేవించి భార్య తన మాట వినటం లేదని ఇంట్లోనే చనిపోతానని గొడవ పెట్టుకున్నాడు. అదే కోపంతో కాశీరాం బయటకు వచ్చి అక్కడే ఉన్న వాటర్‌ ట్యాంక్‌ ఎక్కి చనిపోతానని బెదిరించాడు. ట్యాంక్‌ దిగిరా నీ మాట వింటాను అని భార్య చెప్పిన భర్త వినలేదు.

ట్యాంక్‌పైనే తిరుగుతూ చనిపోతానని బెదరించాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి సీఐ ప్రసాద్, ఎస్సై పాండేరావు చేరుకున్నారు. మీ భార్య నీ మాట వినేలా చూస్తామని పోలీసులు చెప్పిన అతను ట్యాంక్‌ దిగలేడు. ఫైర్‌ ఇంజిన్‌ తెప్పించి పోలీసులు, యువకులు ట్యాంక్‌ ఎక్కి కాశీరాంను కిందకు దించి  పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. భార్య ఫిర్యాదు మేరకు ఆత్మహత్యయత్నం కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

PREV
click me!

Recommended Stories

ముగిసిన పల్లె పోరు.. కాంగ్రెస్‌దే ఆధిపత్యం.. బీఆర్ఎస్ సంతృప్తి.. ఏయే పార్టీలు ఎన్ని స్థానాలు గెలిచాయంటే
100 ఏళ్లైన చెక్కుచెద‌ర‌ని, అతిపెద్ద ప్రార్థ‌న మందిరం.. హైద‌రాబాద్‌కు ద‌గ్గ‌రలో అద్భుత నిర్మాణం