ముఖానికి కట్టుకున్న స్కార్ఫ్... ఆమె ప్రాణం తీసింది!

Published : Jun 10, 2020, 10:36 AM IST
ముఖానికి కట్టుకున్న స్కార్ఫ్... ఆమె ప్రాణం తీసింది!

సారాంశం

కరోనా వైరస్‌ కారణంగా లాక్‌డౌన్‌ విధించడంతో అక్కడే ఉండి పోయింది. ఇంటికి వెళ్తానని చెప్పడంతో అన్న అల్లుడు గఫూర్‌ కృష్ణా జిల్లా నందిగామ వెళ్తుండగా ఆమె కూడా మోటార్‌ సైకిల్‌పై బయలు దేరింది.

అమ్మాయిలు బయటకు వచ్చినప్పుడు ముఖానికి స్కార్ఫ్ కట్టుకుంటూ ఉంటారు. అది చాలా సర్వసాధారణం. కానీ ఆ స్కార్ఫే ఓ మహిళ ప్రాణాలు తీసింది. ఈ దారుణ సంఘటన తల్లాడలో చోటుచేసుకోగా పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

కృష్ణా జిల్లా విజయవాడ రూరల్‌ మండలం పైడూరూపాడు గ్రామానికి చెందిన షేక్‌ మాలన్‌బీ (45) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలోని తన అన్న ఇంటికి వెళ్లింది. కరోనా వైరస్‌ కారణంగా లాక్‌డౌన్‌ విధించడంతో అక్కడే ఉండి పోయింది. ఇంటికి వెళ్తానని చెప్పడంతో అన్న అల్లుడు గఫూర్‌ కృష్ణా జిల్లా నందిగామ వెళ్తుండగా ఆమె కూడా మోటార్‌ సైకిల్‌పై బయలు దేరింది.

మోటార్‌ సైకిల్‌పై నందిగామ వెళ్లి అక్కడ నుంచి బస్సులో వెళ్తానని చెప్పింది. కరోనా వల్ల ముఖానికి స్కార్ఫ్‌ కట్టుకొని ప్రయాణిస్తుండగా తల్లాడ సమీపంలో వెనుక చక్రంలో స్కార్ఫ్‌ చుట్టుకొని మాలన్‌బీ కింద పడటంతో బలమైన గాయమైంది. దీంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఈ మేరకు ఎస్‌ఐ బి.తిరుపతిరెడ్డి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మధిర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఆదిలాబాద్ కంటే హైదరాబాద్ లోనే లోయెస్ట్ టెంపరేచర్స్ .. స్కూల్ టైమింగ్స్ చేంజ్
ముగిసిన పల్లె పోరు.. కాంగ్రెస్‌దే ఆధిపత్యం.. బీఆర్ఎస్ సంతృప్తి.. ఏయే పార్టీలు ఎన్ని స్థానాలు గెలిచాయంటే