కడుపులో కాటన్‌ పెట్టి కుట్టేశారు: వైద్యుల నిర్లక్ష్యంపై పోలీసులకు ఫిర్యాదు

By narsimha lodeFirst Published Jun 10, 2020, 10:49 AM IST
Highlights

 వైద్యుల నిర్లక్ష్యంతో  ఓ మహిళ కడుపునొన్పితో బాధపడ్డారు. బాధితురాలి కుటుంబసభ్యులు ఆసుపత్రిపై ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని బాధితురాలి కుటుంబ సభ్యులు తెలిపారు.

హైదరాబాద్: వైద్యుల నిర్లక్ష్యంతో  ఓ మహిళ కడుపునొన్పితో బాధపడ్డారు. బాధితురాలి కుటుంబసభ్యులు ఆసుపత్రిపై ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని బాధితురాలి కుటుంబ సభ్యులు తెలిపారు.

రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండల కేంద్రానికి చెందిన నార్లకంటి లాలమ్మ ఏడాదిగా కడుపునొప్పితో బాధపడుతోంది. దీంతో స్థానికంగా ఉండే ఆసుపత్రిలో చికిత్స తీసుకొంది. ఆమెకు తగ్గలేదు. ఆమనగల్లులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించుకొంది. కడపులో కణితులు ఉన్నాయని వైద్యుడు తేల్చి చెప్పారు.

హైద్రాబాద్ ఆసుపత్రికి తీసుకెళ్లి శస్త్ర చికిత్స చేయించాలని సూచించాడు. దీంతో ఆమె బాలానగర్ లోని ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లింది. 2019 ఫిబ్రవరిలో ఆమెకు ఆసుపత్రిలో చికిత్స నిర్వహించారు. కోలుకొన్న తర్వాత ఆమెను ఇంటికి పంపారు.

కొంతకాలం పాటు ఆమె ఆరోగ్యంగానే ఉంది. కానీ, కొంతకాలంగా ఆమెకు మళ్లీ కడుపు నొప్పి వస్తోంది. ఈ విషయమై మళ్లీ ఆమె ఆసుపత్రుల చుట్టూ తిరిగింది. రెండు రోజుల క్రితం హైద్రాబాద్ కర్మన్‌ఘాట్ లోని గ్లోబల్ ఆసుపత్రిలో ఆమెనుు చేర్పించారు. కడుపులో ఇంకా కణితులు ఉన్నాయని వైద్యులు గుర్తించారు. శస్త్రచికిత్స చేయాలని వైద్యులు సూచించారు.

రెండు రోజుల క్రితం ఆమెకు ఆపరేషన్ నిర్వహించారు. అయితే కడుపులో కణితులతో పాటు ఆపరేషన్ సమయంలో వినియోగించే  పత్తి ఉండలు కూడ బయటపడ్డాయి.  గతంలో ఆపరేషన్ చేసిన సమయంలో పొరపాటున కాటన్ కూడ కడుపులో పెట్టి కుట్టేశారని వైద్యులు అనుమానిస్తున్నారు. 

గత ఏడాదిలో శస్త్రచికిత్స చేసిన ఆసుపత్రి వద్దకు బాధితురాలి కుటుంబసభ్యులు వెళ్లారు. అయితే అప్పటికే ఆ ఆసుపత్రి మూతపడింది. దీంతో బాలాపూర్ పోలీస్ స్టేషన్ లో బాధితురాలి కుటుంబసభ్యులు కేసు నమోదు చేశారు. 

click me!