తెలంగాణ అసెంబ్లీ ముందు వ్యక్తి ఆత్మహత్యాయత్నం: అడ్డుకున్న పోలీసులు

Published : Feb 10, 2023, 10:46 AM ISTUpdated : Feb 10, 2023, 10:51 AM IST
తెలంగాణ అసెంబ్లీ ముందు  వ్యక్తి ఆత్మహత్యాయత్నం: అడ్డుకున్న పోలీసులు

సారాంశం

తెలంగాణ అసెంబ్లీ ముందు శుక్రవారం నాడు  ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి   పాల్పడ్డాడు.    

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ముందు  శుక్రవారం నాడు  ఓ వ్యక్తి  ఆత్మహత్యాయత్నానికి  ప్రయత్నించాడు.  అసెంబ్లీ ముందు  సెక్యూరిటీ  విధులు నిర్వహిస్తున్న  పోలీసులు అతడిని అడ్డుకున్నారు.   ఆత్మహత్యాయత్నానికి  ప్రయత్నించిన వ్యక్తిని శంషాబాద్ కు  చెందిన వాడుగా  గుర్తించారు.  అసెంబ్లీ ముందు  ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడనే  విషయమై  పోలీసులు  ఆరా తీస్తున్నారు. 

తమ సమస్యలు  ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశ్యంతో  అసెంబ్లీ , ప్రగతి భవన్ ముందు ఆత్మహత్యాయత్నాలకు  పాల్పడుతున్నారు. ఈ తరహ ఘటనలు ఇటీవల కాలంలో   ఎక్కువగా  జరుగుతున్నాయి.  2020 అక్టోబర్ మాసంలో  తెలంగాణ అసెంబ్లీకి సమీపంలో  ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. ఒంటికి నిప్పు అంటించుకొన్నాడు. వెంటనే  పోలీసులు మంటలను ఆర్పి ఆసుపత్రికి తరలించారు.  

ప్రగతి భవన్ ముందు  ఈ తరహ ఘటనలు  ఇటీవల కాలంలో  ఎక్కువగా  నమోదౌతున్నాయి.  అధికారులు పట్టించుకోవడం లేదని, భూములు ఆక్రమణకు గురయ్యాయయని  ఆత్మహత్యాయత్నాలకు  పాల్పడుతున్నారు.  

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్
School Holidays : నెక్ట్స్ వీక్ లో వరుసగా రెండ్రోజులు సెలవులు ఖాయం.. మరో రెండ్రోజులు కూడానా?