కామారెడ్డిలో మూడు రోజులుగా గుహలోనే రాజు: 40 గంటలుగా కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్స్

By narsimha lode  |  First Published Dec 15, 2022, 11:32 AM IST

నిజామాబాద్ జిల్లా ఎడవల్లి మండలం జానకంపేటలో ఆర్ధిక ఇబ్బందులతో  సాయిలు కుటుంబం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటనలో  సాయిలు మృతి చెందాడు. 


నిజామాబాద్:కామారెడ్డి జిల్లాలోని  రామారెడ్డి మండలం  రెడ్డిపేట పులిగుట్ట వద్ద  రాజు అనే వ్యక్తిని కాపాడేందుకు  పోలీసులు ప్రయత్నిస్తున్నారు.  40 గంటలకు పైగా రాజును కాపాడేందుకు రెస్క్యూ ఆపరేషన్స్ చేస్తున్నారు.   ఈ నెల 13వ తేదీన  సాయంత్రం  స్నేహితుడు మహేష్ తో కలిసి  రాజు  ఘన్‌పూర్  శివారులో  అడవి ప్రాంతానికి వెళ్లాడు. వేట కోసం  రాజు వెళ్లినట్టుగా  సమాచారం.ఈ ప్రాంతానికి ఎందుకు  వచ్చారనే విషయమై  చెప్పడం లేదని  పోలీసులు చెబుతున్నారు. పులిగుట్ట వద్ద బండరాళ్లపై  నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో  రాజు సెల్ ఫోన్  బండరాళ్ల మధ్య పడిపోయింది.ఈ ఫోన్ ను తీసుకొనేందుకు గాను  రాజు  ప్రయత్నించారు.ఈ సమయంలో  రాజు  ప్రమాదవశాత్తు గుహలో బండరాళ్ల మధ్య ఇరుక్కుపోయాడు. 

ఈ నెల 13వ తేదీ మధ్యాహ్నం వరకు  రాజు గుహలో  చిక్కుకున్న విషయాన్ని పోలీసులకు చెప్పలేదు.ఈ విషయమై సమాచారం అందుకున్న పోలీసులు నిన్న మధ్యాహ్నం నుండి రాజును గుహ నుండి బయలకు తీసేందుకు  ప్రయత్నాలు ప్రారంభించారు. బండరాళ్ల మధ్య  రాజు తలకిందులుగా వేలాడుతున్నాడు.  బండరాళ్లను పగులగొట్టి  రాజును బయటకు తీసేందుకు  పోలీసులు ప్రయత్నిస్తున్నారు.  గుహలో  బండరాళ్ల  మధ్య  ఇరుక్కున్న  రాజు వద్దకు ఆశోక్ అనే వ్యక్తిని పంపారు. గ్లూకోజ్ వాటర్ , ఆహారం పంపారు. ఆశోక్ తో రాజు మాట్లాడారు. 

Latest Videos

undefined

also read:అడవిలో షికారుకెళ్లి... గుహలో ఇరుక్కుపోయి, 24 గంటలుగా నరకయాతన

  బండరాళ్ల మధ్యలో  రాజు శరీరం ఇరుక్కొంది.  దీంతో అతను బయటకు రాలేకపోతున్నాడని ఆశోక్ చెప్పాడు. నాలుగు జేసీబీల సహాయంతో  బండరాళ్లను తొలగించే ప్రయత్నాలు  చేస్తున్నారు. అంతేకాదు బండరాళ్లు బ్లాస్ట్  చేసే సమయంలో  రాజుకు ఇబ్బంది కలగకుండా  అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి 20 నిమిషాలకు ఓసారి రాజుతో  మాట్లాడుతున్నారు. 40 మంది వైద్య సిబ్బంది  రాజు ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు  సమీక్షిస్తున్నారు. రాజుకు  సెలైన్  పెట్టారు.రాజును గుహ నుండి బయటకు తీసే సహయక చర్యలను ఏఎస్పీ  దగరుండి పర్యవేక్షిస్తున్నారు. కామారెడ్డి జిల్లా ఎస్పీ కూడా సంఘటన స్థలానికి  చేరుకొని  సహాయక చర్యలను పరిశీలించారు.
 

click me!