నిజామాబాద్ జిల్లా ఎడవల్లి మండలం జానకంపేటలో ఆర్ధిక ఇబ్బందులతో సాయిలు కుటుంబం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటనలో సాయిలు మృతి చెందాడు. సాయిలు భార్య, పిల్లలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
నిజామాబాద్: ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఎడవల్లి మండలం జానకంపేటలో అప్పుల బాధ భరించలేక కుటుంబం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటనలో భర్త సాయిలు మృతి చెందాడు. భార్యతో పాటు పిల్లలు ఈ ఘటనలో తీవ్రంగా అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గురైన వారిని ఆసుపత్రిలో చేర్పించారు.
జానకంపేటలో సాయిలు అనే వ్యక్తి తన కుటుంబంతో నివాసం ఉంటున్నాడు. అయితే సాయిలు కొంత కాలంగా ఆర్ధికంగా ఇబ్బంది పడుతున్నారు.దీంతో తన కుటుంబంతో పాటు ఆత్మహత్య చేసుకోవాలని భావించాడు. కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం నాడు రాత్రి సాయిలు పురుగుల మందు తాగాడు. ఈ ఘటనలో సాయిలు వెంటనే మృతి చెందాడు. సాయిలు భార్య రేఖ, కొడుకులు, చరణ్, అరుణ్ లు అస్వస్థతకు గురయ్యారు. సాయిలు కుటుంబం పురుగుల మందు తాగిన విషయాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. సాయిలు భార్య రేఖ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు. సాయిలు కొడుకుల చరణ్, అరుణ్ ల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.