అడవిలో షికారుకెళ్లి... గుహలో ఇరుక్కుపోయి, 24 గంటలుగా నరకయాతన

Siva Kodati |  
Published : Dec 14, 2022, 06:33 PM IST
అడవిలో షికారుకెళ్లి... గుహలో ఇరుక్కుపోయి, 24 గంటలుగా నరకయాతన

సారాంశం

కామారెడ్డి జిల్లా రెడ్డిపేటకు చెందిన సింగరాయపల్లి రాజు అనే వ్యక్తి గుహలో ఇరుక్కుపోయి 24 గంటలుగా నరకయాతన అనుభవిస్తున్నాడు. అతనిని బయటకు తీసేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. 

అడవి షికారు సరదా ఓ వ్యక్తి ప్రాణాలకే ముప్పు తెచ్చింది. కామారెడ్డి జిల్లా రెడ్డిపేటకు చెందిన సింగరాయపల్లి రాజు అనే వ్యక్తి అడవిలో షికారుకు వెళ్లాడు. అయితే ప్రమాదవశాత్తూ రాళ్లపై నుంచి అదుపుతప్పి గుహలో పడిపోయాడు. 24 గంటల పాటు గుహలో రాళ్ల మధ్య నరకం అనుభవించాడు. ఎంత ప్రయత్నించినా బయటకు వచ్చేందుకు వీలు కాలేదు. రాజు ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు గాలిస్తుండగా.. కేకలు వినిపించడంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు రాజును బయటకు తీసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 
 

PREV
click me!

Recommended Stories

Cold Wave: వ‌చ్చే 4 రోజులు చుక్క‌లే.. గ‌జ‌గ‌జ వ‌ణకాల్సిందే. ఎల్లో అల‌ర్ట్
Vegetables Price : వీకెండ్ మార్కెట్స్ లో ఏ కూరగాయ ధర ఎంత..?