అర్థరాత్రి సింగరేణి కార్మికుడి హత్య.. భార్య, ప్రియుడి పనేనంటున్న పోలీసులు..

By Bukka SumabalaFirst Published Aug 22, 2022, 11:31 AM IST
Highlights

ఓ భార్య భర్తను అతి కిరాతకంగా చంపించింది. అర్థరాత్రి ఇద్దరు వ్యక్తులు అతి సమీపం నుంచి కాల్చి చంపితే.. ఆ సమయంలో తాను బాత్రూంలో ఉన్నానట్టు చెప్పుకొచ్చింది. 

హైదరాబాద్ : సింగరేణి కాలరీస్ లో శనివారం ఓ కార్మికుడి హత్య జరిగింది. ఈ దారుణం వెనుక అతని భార్య, ప్రియుడు ఉన్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. వివరాల్లోకి వెడితే.. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్‌సిసిఎల్)లో కొరకొప్పుల రాజేందర్ గౌడ్ (28)  కార్మికుడిగా పనిచేస్తున్నారు. కొరకొప్పుల రాజేందర్ గౌడ్ శనివారం తెల్లవారుజామున గోదావరిఖనిలోని అతని నివాసంలో హత్యకు గురయ్యాడు. అతడిని గుర్తుతెలియని దుండగులు ఇద్దరు కాల్చి చంపారు. ఈ హత్య వెనుక కొరకొప్పుల రాజేందర్ గౌడ్ భార్య, ఆమె భర్త పాత్ర ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

నిందితులు తమను గుర్తించడానికి వీలు లేకుండా ముఖానికి హెల్మెట్ పెట్టుకుని వచ్చారు. కొరకొప్పుల రాజేందర్ గౌడ్ గాఢనిద్రలో ఉన్న సమయంలో అతి దగ్గరి నుంచి కాల్పులు జరిపారని గోదావరిఖని పోలీసులు తెలిపారు. దీంతో గౌడ్ అక్కడికక్కడే మృతి చెందాడు. తెల్లవారుజామున 2 గంటల సమయంలో గంగానగర్ లోని అతని నివాసంలో ఈ ఘటన జరిగింది. బైక్‌పై వచ్చిన హంతకులు కాల్పుల తరువాత, గౌడ్‌ మృతి చెందినట్లు నిర్ధారించుకున్నాక అక్కడి నుంచి పరారయ్యారు. వారు పరారైన తరువాత రాజేందర్ గౌడ్ భార్య రవళి పోలీసులకు ఫోన్ చేసి జరిగిన హత్య విషయాన్ని తెలియజేసింది.

గౌడ్‌ శరీరంపై ఒకటి, రెండు బుల్లెట్ గాయాలయ్యాయి. రాజేందర్ గౌడ్ మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్‌లోని 7-ఏ బొగ్గు గనిలో జనరల్ మజ్దూర్‌గా పనిచేస్తున్నాడు. హంతకులు కంట్రీ మేడ్ పిస్టల్‌ను ఉపయోగించారని పోలీసులు తెలిపారు. "వారు బీహార్ నుండి ఆయుధాన్ని కొనుగోలు చేశారు. హత్యకు రెండు నెలల క్రితమే ప్లాన్ చేశారు" అని పోలీసులు చెప్పారు.

నిజామాబాద్‌లో షాకింగ్ ఘటన.. హోటల్‌లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య..

భార్యను విచారించగా.. హత్య జరిగిన సమయంలో తాను వాష్‌రూమ్‌లో ఉన్నానని రవళి పోలీసులకు తెలిపింది. ఆమె సమాధానాలతో సంతృప్తి చెందని పోలీసులు రవళిని అదుపులోకి తీసుకున్నారు. అనుమానంతో ప్రశ్నించారు. ఈ హత్య ఆమె ప్రియుడే చేయించాడు. హంతకుల్లో ఒకరు రవళికి తెలుసు... హత్య వెనుక గల కారణాలను వెలికితీసేందుకు దర్యాప్తు కొనసాగుతోంది" అని పోలీసు అధికారి తెలిపారు.

కాగా, ఇలాంటి ఘటనే కాకినాడలో వెలుగుచూసింది. కాకినాడ ప్రత్యేక పోక్సో కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ మహమ్మద్ అక్బర్ ఆజాం ఈ ఏడాది జూన్ 23న మరణించారు. హత్య అని అంచనాలతో 59 రోజుల తర్వాత శవపరీక్ష చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు.. పీపీ అక్బర్ ఆజాం (50)మొదటి భార్య పదిహేనేళ్ల కిందట మరణించింది. తర్వాత ఆయన యానాంకు చెందిన అహ్మద్దున్నీసా బేగం (36)ను రెండో వివాహం చేసుకున్నారు. వీరికి కుమార్తె, కుమారుడు సంతానం. గతంలో ఆయన తన భార్యకు కొత్త ఫోన్ కొనిచ్చి, అప్పటిదాకా ఆమె వాడిన పాత ఫోనును తన తండ్రి హుస్సేన్కు ఇచ్చాడు. 

కొడుకు మరణాంతరం ఇటీవల హుస్సేన్ ఆ ఫోన్ లోని పాత వాట్సాప్ చాటింగ్ లు, వాయిస్ మెసేజ్ లను గమనించారు. దీంతో హత్య విషయం వెలుగులోకి వచ్చింది. ఆ తరువాత పోలీసుల విచారణలో విస్తుపోయే వాస్తవాలు బయటపడ్డాయి. జూన్ 23న అహ్మదున్నీసా తన భర్తకు ముందుగా నిద్రమాత్రలు ఇచ్చింది. గాఢనిద్రలోకి వెళ్లగా మెడికల్ రిప్రజెంటేటివ్ కిరణ్ తన వెంట తెచ్చిన క్లోరోఫామ్ ను ఓ గుడ్డలో వేసి దాన్ని ఆజాం ముక్కు వద్ద గట్టిగా అదిమి పెట్టాడు. ఇందుకు భార్య సహకరించింది. ఆ సమయంలో రాజేష్ చైన్ ఇంటి బయట కాపలాగా ఉన్నాడు. మోతాదు ఎక్కువ కావడంతో ఆజా మరణించారని పోలీసులు విచారణలో తేలింది.  అహ్మద్దున్నీసా, కిరణ్, రాజేంద్ర నిందితులుగా పేర్కొన్న పోలీసులు ముగ్గురిని విచారిస్తున్నట్లు సమాచారం.
 

click me!