TS ICET Result 2022: అభ్యర్థులకు కీలక అప్‌డేట్.. టీఎస్ ఐసెట్ ఫలితాలు ఎప్పుడంటే..?

By Sumanth KanukulaFirst Published Aug 22, 2022, 11:23 AM IST
Highlights

తెలంగాణలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఐసెట్-2022 ఫలితాల విడుదల ఆలస్యం కానుంది. సాంకేతిక కారణాలతో ఫలితాల విడుదలను అధికారులు వాయిదా వేశారని అధికార వర్గాల సమాచారం.

తెలంగాణలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఐసెట్-2022 ఫలితాల విడుదల ఆలస్యం కానుంది. షెడ్యూల్ ప్రకారం తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ నేడు ఫలితాలను విడుదల చేయాల్సి ఉంది. అయితే తాజా సమాచారం ప్రకారం.. ఫలితాల విడుదల ఆలస్యం కానున్నట్టుగా తెలుస్తోంది. సాంకేతిక కారణాలతో ఫలితాల విడుదలను అధికారులు వాయిదా వేశారని సమాచారం. ఐసెట్ ఫలితాలు శనివారం విడుదలయ్యే అవకాశం ఉన్నట్టుగా సంబంధిత వర్గాలు తెలిపాయి. 

ఈ సారి ఐసెట్‌ను కాకతీయ విశ్వవిద్యాలయం నిర్వహించింది.  ప్రవేశ పరీక్షను జులై 27, 28 తేదీల్లో నాలుగు సెషన్లలో నిర్వహించారు. తెలంగాణతో పాటు ఏపీలో కూడా పలు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. టీఎస్ ఐసెట్‌-2022కు 75,952 మంది దరఖాస్తు చేసుకోగా..  68,781 మంది హాజరుకాగా, 7171 మంది పరీక్షకు గైర్హాజరయ్యారు. 

ఐసెట్ ఫలితాలు విడుదలైన తర్వాత.. https://icet.tsche.ac.in/ లో రిజల్ట్స్ అందుబాటులో ఉండనున్నాయి. అభ్యర్థులు వారి వివరాలు ఎంటర్ చేసి.. ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. 

click me!