
చింతకాని : చెట్టంత కొడుకు చనిపోయాడు అనే బాధ లేదా వ్యక్తికి…సరికదా.. భర్తలేని బాధలో ఉన్న daughter in lawని కూతురులా చేసుకోవాల్సింది పోయి ఆమె పై మోజు పడ్డాడు. తనను పెళ్లి చేసుకోవాలని ఆమెకు harassmentకు గురిచేశాడు. మాట వినడం లేదని ఆగ్రహంతో ఆమెపై murder attempt చేశాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లా చింతకాని మండలం రైల్వే కాలనీ గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి స్వయానా తన సోదరి కూతురిని ఇంటి కోడలిగా చేసుకోవాలనుకున్నాడు.
ఆమెను తన కుమారుడికి ఇచ్చి పెళ్ళి చేశాడు. అయితే అనారోగ్యంతో ఇటీవల కుమారుడు మృతి చెందాడు. ఇదే అదనుగా మేనమామ కొన్నాళ్లుగా తనను పెళ్లి చేసుకోవాలని కోడలిపై ఒత్తిడి తెస్తున్నాడు. ఈ విషయంపై కుటుంబంలో మంగళవారం ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో ఆగ్రహానికి లోనైన మామ, కోడలిని కత్తితో పొడిచేందుకు ప్రయత్నించాడు. బాధితురాలి తల్లి అడ్డుగా వెళ్ళింది. దాంతో ఆమెకు రెండు చోట్ల కత్తిపోట్లు తగిలాయి. వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కోడలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇదిలా ఉంటే.. నిరుడు జూన్ లో ఓ కోడలే అత్తను చంపి, సీక్రెట్ గా కాల్చి, ఇంట్లోనే పూడ్చిపెట్టే ప్రయత్నం చేసిన ఘటన గుజరాత్ లో కలకలం రేపింది. అత్తతో గొడవపడి ఆమెను రాడ్ తో కొట్టి చంపింది ఓ కోడలు. అంతటితో ఆగకుండా ఆమె మృతదేహాన్ని ఇంట్లోనే కాల్చేయాలని ప్రయత్నించింది. అయితే ఇరుగుపొరుగు వారికి అనుమానం రావడంతో విషయం బయటపడింది. వారు పోలీసులకు సమాచారం అందించడంతో.. కోడలిని అరెస్ట్ చేశారు.
పోలీసుల విచారణలో ఒళ్లు గగుర్పొడిచే షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. సదరు కోడలికి మామతో శారీరక సంబంధం ఉంది. దీనిమీద అత్తకు అనుమానం రావడంతో అడ్డుతొలిగించుకోవడానికి హత్య చేసింది. ఈ సంఘటన పూర్తి వివరాల్లోకి వెడితే.... అహ్మదాబాద్ లోని ఘోటా ఏరియాలోని రాయల్ హోమ్స్ కాలనీలో ఈ దారుణం జరిగింది. మంగళవారం రాత్రి అత్త రేఖా అగర్వాల్ తలమీద కోడలు నిఖితా అలియాస్ న్యారా రాడ్ తో కొట్టి చంపింది. రేఖా అగర్వాల్ కొడుకు దీపక్ తో ఈ జనవరిలో నిఖితాకు పెళ్లయ్యింది. అయితే పెళ్లైన కొద్దిరోజులకే అత్తాకోడళ్ల మధ్య గొడవలు మొదలయ్యాయి.
దీనికి కారణం.. పెళ్లైన కొద్దిరోజులకే నిఖితకు భర్త తండ్రి అయిన మామతో సంబంధం ఏర్పడింది. వీరిద్దరూ రహస్యంగా కలుసుకుని శారీరకసుఖం పొందేవారు. దీనికోసం వీరిద్దరు ఇంట్లోనే కాకుండా నగరానికి వెలుపల హోటల్స్ కు కూడా వెళ్లేవాళ్లు. నిందితురాలు నిఖిత గర్భవతి అయ్యింది. అయితే ఆమె గర్భంలో పెరుగుతున్నది మామ సంతానమే అని అత్త అనుమానించింది. దీంతో నిఖితతో గొడవపడడం మొదలు పెట్టింది. అలాగే మంగళవారం రాత్రి కూడా ఇద్దరి మధ్య ఈ విషయంగా గొడవ జరిగింది. గొడవ ముదరడంతో కోడలు అత్త నెత్తిమీద రాడ్ తో కొట్టి చంపింది. హత్య జరిగిన సమయంలో నిఖిత భర్త దీపక్ పక్కనే ఉన్న గుడికి వెళ్లాడు.