
హైదరాబాద్: Cowను అక్రమంగా తరలిస్తున్నారనే సమాచారంతో గోరక్షక సేవా సమితి సభ్యులు, గోవుల తరలింపు దారుల మధ్య ఘర్షణ చోటు చేసుకోవడంతో Hyderabad కర్మన్ ఘాట్ లో ఉద్రిక్తత నెలకొంది. దీంతో పోలీసులు భారీగా మోహరించారు.
గోవులను అక్రమంగా తరలిస్తున్నారనే సమాచారంతో హైదరాబాద్లోని karmanghat గోరక్షక సేవాసమితి సభ్యులు TKR కమాన్ వద్ద వాహనాన్ని అడ్డగించారు. Gau Rakshaks సభ్యులు గోవులను తరలిస్తున్న వారి మధ్య వాగ్వాదం చోటు చేసుకొంది. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. పరస్పరం దాడులు చేసుకొన్నారు. వాహనాలు దెబ్బతినడంతో పాటు గోరక్షకులపై తరలింపుదారులు దాడికి పాల్పడ్డారు. గోరక్షకుల నుంచి తప్పించుకునేందుకు తరలింపుదారులు దగ్గరలోని హనుమాన్ ఆలయంలో తలదాచుకున్నారు. వారిని తక్షణమే అదుపులోకి తీసుకోవాలంటూ యువకులు రాత్రంతా నిరసన చేపట్టారు. తమపై దాడికి పాల్పడ్డ దుండగులను వెంటనే Arrest చేయాలని పోలీసులను గోసంరక్షకులు డిమాండ్ చేశారు
మంగళవారం రాత్రి 9 గంటల నుండి ప్రారంభమైన ఆందోళన బుధవారం నాడు ఉదయం 3 గంటల వరకు కొనసాగింది.ఈ క్రమంలో పోలీసులకు నిరసనకారులకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది.
ఆందోళనకారులను చెదరగొట్టడానికి పోలీసులు Lathi charge చేశారు. ఆందోళనకారులు పలువురిని అరెస్టు చేసి వాహనాల్లో తరలించారు. ఆగ్రహానికి గురైన యువత పోలీసులపై రాళ్లు రువ్వారు. ఈ క్రమంలో ఇద్దరు పోలీసులకు గాయాలయ్యాయి.పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పలు పోలీస్ స్టేషన్ల నుంచి అదనపు బలగాలను మోహరించారు. పలువురిని అరెస్టు చేసి మీర్పేట్, సరూర్నగర్ పీఎస్‌లకు తరలించారు.