
హైదరాబాద్:BJPకి చెందిన కరీంనగర్, Hyderabad కు చెందిన కొందరు నేతలు అసమ్మతి స్వరం విన్పించడంపై ఆ పార్టీ నాయకత్వం సీరీయస్ అయింది. గతంలో హెచ్చరించినా కూడా నేతల తీరు మారకపోవడంతో పార్టీ నాయకత్వం ఈ విషయమై నోటీసులు జారీ చేయాలని భావిస్తోంది. ఇవాళ ఢీల్లీ టూర్ లో ఉన్న బీజేపీ కీలక నేతల బృందం కూడా పార్టీ అగ్రనాయకత్వంతో ఈ విషయమై చర్చించనున్నారు.
karimnagar జిల్లాకు చెందిన Gujjula Ramakrishna Reddy, సుగుణాకర్ రావు, వెంకటరమణి, రాములు తదితర నేతలు మంగళశారం నాడు హైద్రాబాద్ ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో సమావేశమయ్యారు.ఈ సమావేశంపై బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు Bandi Sanjay కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం నాడు బీజేపీ కరీంనగర్ జిల్లా పదాధికారుల సమావేశంలో సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. పార్టీ లైన్ తప్పితే ఎంతటి సీనియర్లైనా వేటు తప్పదని హెచ్చరించారు.
పార్టీ సీనియర్ నేత ఇంద్రసేనారెడ్డి అసమ్మతి నేతలతో గతంలోనే ముఖాముఖి సమావేశమై చర్చించిన తర్వాత కూడా నేతలు మాత్రం మారలేదు. నిన్న రెండోసారి సమావేశం కావడం పార్టీలో చర్చకు దారి తీసింది. గుజ్జుల రామకృష్ణారెడ్డి, సుగుణాకర్ రావు తదితరులు గతంలో కూడా పార్టీలో అసమ్మతి స్వరం విన్పించారని బీజేపీకి చెందిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా నేతలు గుర్తు చేస్తున్నారు. ఈ విషయమై ఈ నేతలపై చర్యలు తీసుకోవాలని తీర్మానం చేశారు. గతంలో కిషన్ రెడ్డి, లక్ష్మణ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేసిన సమయంలో కూడా ఇదే తరహలో అసంతృప్తి గళం విన్పించారని జిల్లా నేతలు గుర్తు చేశారు.
ఇవాళ Delhi టూర్ లో ఉన్న బండి సంజయ్ బృందం పార్టీ అగ్ర నాయకత్వంతో ఈ విషయమై చర్చించే అవకాశం ఉంది. రెండోసారి సమావేశమైన అసమ్మతి నేతలకు పార్టీ నాయకత్వం నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. ఒకటి రెండు రోజుల్లో నేతలకు notice జారీ చేయనున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
గతంలోనే ఈ రకమైన రహస్య సమావేశాలపై బీజేపీ నాయకత్వం సీరియస్ అయ్యింది. మాజీ ఎమ్మెల్యే ఇంద్రసేనారెడ్డి అసమ్మతి నేతలతో చర్చించారు. భవిష్యత్తులో ఈ రకంగా అసమ్మతి సమావేశాలు నిర్వహించవద్దని సూచించారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీరుపైనే అసమ్మతి నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.
గతంలో నిర్వహించిన సమావేశాలపై బీజేపీ నాయకత్వం సీరియస్ అయినట్టుగా తెలుస్తోంది. కొందరిపై పార్టీ నాయకత్వం చర్యలు తీసుకొంటారనే చర్చ కూడా సాగింది. కానీ అసమ్మతి నేతలపై చర్యలు తీసుకోలేదు. దీంతో మరోసారి అసమ్మతి నేతలు మరోసారి సమావేశమయ్యారు. అయితే ఈ సమావేశంపై పార్టీ నాయకత్వం ఏ రకంగా చర్యలు తీసుకొంటుందనేది ప్రస్తుతం చర్చ సాగుతుంది.
ఈ ఏడాది జనవరి మాసంలో అసమ్మతి నేతలు సమావేశమయ్యారు. గత పార్లమెంట్ ఎన్నికల తర్వాత పార్టీ తమను పట్టించుకోవడం లేదని కరీంనగర్ జిల్లా స్థానిక నేతలు ఆరోపణలు చేస్తున్నారు. బండి సంజయ్ స్థానిక కార్యక్రమాలకు తమకు సమాచారం ఇవ్వడం లేదని బీజేపీ నేతలు చెబుతున్నారు. కొత్తగా పార్టీలో చేరిన వారికి ఇచ్చిన గుర్తింపు తమకు దక్కడం లేదని ఆత్మగౌరవ సమావేశం నిర్వహించారు.
పార్టీలో సీనియర్లకు ప్రాధాన్యత ఇవ్వడం లేదనే అంశంపై పలువురు సీనియర్ నేతలు రహస్యంగా మీటింగ్ నిర్వహించగా, వీరందరినీ కరీంనగర్ జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షుడు అర్జున్ రావు కోఆర్డినేట్ చేసినట్లుగా అప్పట్లో ప్రచారం సాగింది. మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి, బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి సుగుణాకర్ రావు తదితరులు ఈ సమావేశంలో కీలకపాత్ర పోషించినట్లు సమాచారం. ఈ విషయం పార్టీ అధిష్టానం దృష్టికి వెళ్లడంతో తాము నిర్వహించిన భేటీ వెనుక ఆంతర్యం వేరని అసమ్మతి నేతలు పార్టీ నాయకత్వానికి తేల్చి చెప్పారు.
ఈ నేపథ్యంలోనే వారంతా కేంద్ర మంత్రి Kishan Reddyని కూడా కలిసినట్లుగా అప్పట్లో ప్రచారం సాగింది. అయితే ఈ అంశాన్ని హైకమాండ్ సీరియస్‌గా తీసుకున్న నేపథ్యంలో వారిపై వేటు తప్పదని పార్టీలో జోరుగా చర్చ జరుగుతోంది. అయితే మరోసారి అదే తరహాలో సమావేశం కావడంతో పార్టీ నాయకత్వం ఏ రకమైన చర్యలు తీసుకొంటుందనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది.