తోటి ఉద్యోగి భార్యపై కన్నేసి... ఇంటికెళ్లి మరీ అసభ్యంగా ప్రవర్తించిన నీచుడు

Published : Jun 07, 2023, 11:42 AM IST
తోటి ఉద్యోగి భార్యపై కన్నేసి...  ఇంటికెళ్లి మరీ అసభ్యంగా ప్రవర్తించిన నీచుడు

సారాంశం

తనవద్ద పనిచేసే ఉద్యోగి భార్య వెంటపడుతూ వేధింపులకు దిగిన ఓ వ్యక్తిని బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసారు.

హైదరాబాద్ :ఒకే సంస్థలో పనిచేసే తోటి ఉద్యోగి భార్యపైనే ఒకడు కన్నేసాడు. భర్త విధులకు వెళ్లిన సమయంలో ఇంటికి వెళ్లి వివాహితతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఇలా రెండుమూడు రోజులుగా వెంటపడుతూ వేధిస్తున్న అతడి చేష్టలను భరించలేక వివాహిత పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటన హైదరాబాద్ లో వెలుగుచూసింది. 

బాధిత మహిళ, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తెలంగాణ రాజధాని నగరం హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ సంస్థలో బొల్లి బాలమద్దిలేటి సూపర్ వైజర్ గా పనిచేస్తున్నాడు.ఇతడు బంజారాహిల్స్ లోని ఇందిరానగర్ లో నివాసముంటున్నాడు.అయితే ఇతడు పనిచేసే సంస్థలోనే ఓ వ్యక్తి హౌస్ కీపింగ్ పనులు చేస్తున్నాడు. ఇటీవల హౌస్ కీపర్ ను తన బైక్ పై ఇంటివద్ద వదిలాడు బాలమద్దిలేటి. ఈ క్రమంలోనే అతడి భార్యను చూసిన బాలమద్దిలేటి ఎలాగయినా ఆమెకు దగ్గరవ్వాలనే నీచపు ఆలోచన వచ్చింది. దీంతో ఆ మర్నాటి నుండి వివాహిత వెంటపడటం ప్రారంభించాడు. 

భర్త పనిపై బయటకు వెళ్లగానే ఇంటికి వెళ్ళిన బాలమద్దిలేటి వివాహితతో మాటలు కలిపాడు. ఇలా ఆమెతో మాటలు కలిపి ఫోన్ నెంబర్ తీసుకున్నారు. ఇలా రెండుమూడు రోజులుగా వివాహితను కలిసేందుకు  ప్రయత్నించడం... ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడటం చేసేవాడు. అతడి వేధింపులను ఇక భరించలేకపోయిన వివాహిత భర్తకు విషయం తెలిపింది. దంపతులిద్దరు కలిసి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి బాలమద్దిలేటిపై ఫిర్యాదు చేసారు. 

Read More  వావివరసలు మరిచిన కామాంధుడు... పేరెంట్స్ ను కోల్పోయిన మైనర్ పై బాబాయ్ అత్యాచారం

వివాహితపై వేధింపులకు పాల్పడుతున్న బాలమద్దిలేటిని అరెస్ట్ చేసిన పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసారు. అతన్ని నాంపల్లి కోర్టులో హాజరుపర్చగా ఎనిమిది రోజుల జైలుశిక్ష విధించారు న్యాయమూర్తి. దీంతో అతన్ని జైలుకు పంపారు పోలీసులు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

హైద‌రాబాద్‌లో మరో KPHB కాలనీ.. ప్రతీ ఒక్కరి సొంతింటి కల నిజం చేసేలా, ఎక్కడో తెలుసా?
GCC: హైద‌రాబాద్ ముఖ చిత్రాన్ని మార్చేస్తున్న గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు.. అస‌లేంటీవి? వీటితో జ‌రిగేదేంటీ