వనపర్తిలో దారుణం... గేదెపై అత్యాచారానికి యత్నించి వ్యక్తి మృతి

Arun Kumar P   | Asianet News
Published : Aug 15, 2021, 07:38 AM ISTUpdated : Aug 15, 2021, 08:08 AM IST
వనపర్తిలో దారుణం... గేదెపై అత్యాచారానికి యత్నించి వ్యక్తి  మృతి

సారాంశం

 మూగజీవిపై అఘాయిత్యానికి యత్నించి ప్రాణాలు కోల్పోయాడు ఓ వ్యక్తి. ఈ ఘటన వనపర్తి జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. 

వనపర్తి: కామంతో కల్లుమూసుకు పోయి మూగజీవిపై అత్యాచారానికి పాల్పడ్డాడో వ్యక్తి. పలుమార్లు ఇలా మూగజీవులపై అఘాయిత్యానికి పాల్పడుతూ గ్రామస్తుల చేతిలో దెబ్బలు తిన్న అతడు మరోసారి ఆ పాపం పని చేసే క్రమంలో ప్రాణాలనే కోల్పోయాడు. ఈ ఘటన వనపర్తి జిల్లాలో చోటుచేసుకుంది. 

వివరాల్లోకి వెళితే... వనపర్తి జిల్లాకేంద్రంలోని నాగవరంకు చెందిన ఆంజనేయులు(45) వ్యవసాయ కూలీ. అతడు ఇటీవల ఓ గేదెపై అఘాయిత్యానికి పాల్పడుతూ ఇతడు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. దీంతో గ్రామస్తులు ఇతడిని స్తంభానికి కట్టేసి దేహశుద్ది చేసి గట్టిగా హెచ్చరించి వదిలేశారు. 

అయితే ఈ ఘటన తర్వాత కూడా అతడి బుద్ది  మారలేదు. తాజాగా శనివారం బాల్ రెడ్డి అనే రైతు ఇంటిఆవరణలో గేదెపై అఘాయిత్యానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు గేదెకు కట్టే తాడు మెడకు బిగుసుకుని ప్రాణాలు కోల్పోయాడు. 

read more   భర్త కళ్లెదుటే... మహిళ సజీవ దహనం..!

ఉదయం గేదెల కొట్టంలో ఆంజనేయులు విగతజీవిగా కనిపించడంతో బాల్ రెడ్డి చుట్టుపక్కల వాళ్లకు విషయం తెలిపాడు. వారంతా పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని జిల్లా ఆస్పత్రికి తరలించారు. పోస్టు మార్టం అనంతరం మృతదేహాన్ని అతడి కుటుంబసభ్యులకు అప్పగించారు.  

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. మృతుడు పలుమార్లు మూగజీవాలపై అత్యాచారానికి పాల్పడి పట్టుబడినట్లు స్థానికులు చెబుతున్నారు... ఇప్పుడు కూడా ఇందుకోసమే గేదెల కొట్టంలోకి వెళి చనిపోయి వుంటాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారని పోలీసులు తెలిపారు.
 

PREV
click me!

Recommended Stories

Hyderabad: న్యూ ఇయర్ వేళ మాదక ద్రవ్యాల మత్తు వదిలించే పాట.. ఆవిష్కరించిన వీసీ సజ్జనార్!
Kalvakuntla Kavitha: సీఎం రేవంత్ రెడ్డిపై రెచ్చిపోయిన కల్వకుంట్ల కవిత | Asianet News Telugu