ఆత్మహత్య చేసుకుంటా పర్మిషన్ ఇవ్వండి : మంత్రి కేటీఆర్‌కు రైతు లేఖ

By Siva KodatiFirst Published Jan 22, 2022, 3:46 PM IST
Highlights

ఆత్మహత్య చేసుకునేందుకు తనకు అనుమతిని ఇవ్వాలని కోరుతూ నల్గొండ జిల్లా (nalgonda district) కనగల్ మండలంలో ఎడవెల్లి గ్రామానికి చెందిన చొప్పరి శ్రీను అనే రైతు మంత్రి కేటీఆర్ (ktr) , జిల్లా కలెక్టర్‌లకు లేఖ రాశాడు. తనకు వారసత్వంగా వచ్చిన భూమిలో వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవాడినని శ్రీను లేఖలో ఆయన తెలిపారు.

అయితే పల్లె ప్రకృతి వనానికి తన భూమిని తీసుకున్నారని... కొంత భూమిని గతంలో ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు (eliminati madhava reddy ) కోసం సేకరించారని చెప్పారు. ఇంజినీరింగ్ చదివిన తనకు ఎలాంటి ఉద్యోగమూ లేదని... దీంతో వ్యవసాయమే జీవనాధారంగా బతుకుతున్నానని తెలిపారు. ప్రస్తుతం తాను రోడ్డున పడ్డానని, జీవనం దుర్భరంగా ఉందని, తాను చనిపోయేందుకు అనుమతించాలని శ్రీను కోరారు. తనకు న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్‌కు, కనగల్ తహసీల్దార్‌కు, ఎమ్మెల్యేకు మొరపెట్టుకున్నా ఫలితం లేకపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 

click me!