దొంగతనానికి వచ్చి వృద్ధురాలి నోట్లో గుడ్డలు కుక్కి హత్యాచారం, సెల్ఫీ వీడియో తీసుకుని..దారుణం..

Published : Apr 11, 2023, 06:49 AM IST
దొంగతనానికి వచ్చి వృద్ధురాలి నోట్లో గుడ్డలు కుక్కి హత్యాచారం, సెల్ఫీ వీడియో తీసుకుని..దారుణం..

సారాంశం

దొంగతనానికి వచ్చిన ఓ యువకుడు వృద్ధురాలిమీద అఘాయిత్యానికి పాల్పడి అదంతా సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. 

సూర్యాపేట : తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలో దారుణమైన ఘటన వెలుగు చూసింది. ఓ యువకుడు డబ్బుల కోసం ఓ ఇంట్లోకి చొరబడ్డాడు. ఆ ఇంట్లో ఉన్న వృద్ధురాలు మీద అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆమె నోట్లో బట్టకుక్కి అత్యాచారం చేశాడు. ఆ తరువాత తన గురించి ఎవరికైనా చెబుతుందేమో అని ఆమెను హత్య చేశాడు. అంతటితో అతని పైశాచిక ఆనందం తీరలేదు. చనిపోయిన వృద్ధురాలితో సెల్ఫీవీడియో తీసుకుని తనలోని క్రూరత్వాన్ని బయట పెట్టుకున్నాడు. జిల్లాలోని ఆత్మకూరు మండలం ఇస్తాళపురంలో ఈ దారుణమైన ఘటన జరిగింది. 

సోమవారం దీనికి సంబంధించిన వివరాలను విలేకరులకు ఎస్పీ రాజేంద్రప్రసాద్ వివరించారు…కప్పల విజయ్ (25) ఇస్తాళపురం  గ్రామానికే చెందిన యువకుడు. అతను సూర్యాపేటలో ఉన్న ఓ మద్య దుకాణంలో పనిచేస్తున్నాడు. వృద్ధురాలు ఒకతే ఉండడం గమనించిన విజయ్ ఆమె ఇంట్లో దొంగతనం చేయాలని పథకం వేశాడు. దీనికోసం ఖాలేందర్ అనే స్నేహితుడితో కలిసి ఏప్రిల్ 8న వృద్ధురాలి ఇంటికి వెళ్లారు. తాను ఇంట్లోకి వెళ్లి దొంగతనం చేసుకొని వస్తానని.. ఖాలేందర్ ను  బయట ఉండి ఎవరూ రాకుండా కాపలా ఉండమని  చెప్పాడు.

అనుచరులతో రేపు జూపల్లి భేటీ: భవిష్యత్తు కార్యాచరణపై చర్చ

ఆ తర్వాత విజయ్ లోపలికి వెళ్లడం వెళ్ళడంతోనే అరాచకం మొదలుపెట్టాడు. కాళ్లతో తలుపులను తన్ని.. భయోత్పాతాన్ని లేపుతూ ఇంట్లోకి ప్రవేశించాడు. ఆ తర్వాత ఎదురొచ్చిన వృద్ధురాలి ముఖంపై పిడుగులు గుద్దాడు. అనుకోని ఈ దాడికి తట్టుకోలేక ఆ వృద్ధురాలు స్పృహ తప్పింది. వెంటనే ఆమె నోట్లో బట్టలు కుక్కాడు. ఆమె మీద అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇదంతా తన ఫోన్లో సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. నోట్లో గుడ్డలకు కుక్కడం, అత్యాచారం.. వీటితో ఊపిరి ఆడక వృద్ధురాలు అక్కడికక్కడే మృతి చెందింది.

ఆమె చనిపోయింది కూడా పట్టించుకోకుండా విజయ్ ఇంట్లో ఉన్న ఆరు తులాల బంగారు నగలు, రూ.5 వేల నగదు చోరీ చేసి బయటకు వచ్చేసాడు. డబ్బులు తెల్లారి ఇస్తానని చెప్పి ఖాలేందర్ను అక్కడి నుంచి పంపించాడు. ఆ తర్వాత తొమ్మిదవ తేదీ సూర్యాపేటలో దొంగిలించిన నగలను తాకట్టు పెట్టాడు. 1.90వేలు తీసుకున్నాడు. ఈ డబ్బులో రూ.48వేలు పెట్టి పల్సర్ బైక్ కొన్నాడు. రూ.10000 పెట్టి కొత్త బట్టలు కొనుక్కున్నాడు.  తన  స్నేహితులతో మందు పార్టీ చేసుకోవడం కోసం ఏడు వేల రూపాయలు పెట్టి మందు కొన్నాడు.  

పార్టీ తర్వాత ఏమి తెలియనట్లుగా ఊరికి తిరిగి వచ్చాడు. అప్పటికే హత్య విషయం వెలుగులోకి రావడంతో పోలీసులు విచారణ మొదలుపెట్టారు. ఆరోజు నిందితులిద్దరూ ఊర్లో ఉన్నట్టుగా గుర్తించిన పోలీసులు.. పదవ తేదీన వారిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వారిద్దరు నేరాన్ని అంగీకరించారు.
 

PREV
click me!

Recommended Stories

ముగిసిన పల్లె పోరు.. కాంగ్రెస్‌దే ఆధిపత్యం.. బీఆర్ఎస్ సంతృప్తి.. ఏయే పార్టీలు ఎన్ని స్థానాలు గెలిచాయంటే
100 ఏళ్లైన చెక్కుచెద‌ర‌ని, అతిపెద్ద ప్రార్థ‌న మందిరం.. హైద‌రాబాద్‌కు ద‌గ్గ‌రలో అద్భుత నిర్మాణం