భార్యతో విడాకులు: గదిలోకి తీసుకెళ్లి బాలికపై వ్యక్తి అత్యాచారం

Published : Jun 07, 2021, 07:56 AM IST
భార్యతో విడాకులు: గదిలోకి తీసుకెళ్లి బాలికపై వ్యక్తి అత్యాచారం

సారాంశం

ఓ కామాంధుడు 14 ఏళ్ల బాలికపై అత్యంత దారుణానికి ఒడిగట్టాడు. గతంలో పెళ్లి చేసుకుని భార్యకు విడాకులు ఇచ్చిన అతను పెళ్లి చేసుకుంటానని నమ్మించి బాలికను గదికి తీసుకెళ్లి ఆమెపై అత్యాచారం చేశాడు.

హైదరాబాద్: ఓ వ్యక్తి మైనర్ బాలిక పట్ల అత్యంత నీచంగా ప్రవర్తించాడు. పెళ్లి చేసుకుని భార్యకు విడాకులు ఇచ్చాడు. భార్యతో గొడవల కారణంగా విడాకులు తీసుకున్నాడు. ఓ మైనర్ బాలికపై కన్నేసాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి 14 ఏళ్ల బాలికపై అత్యాచారం చేశాడు. 

హైదరాబాదులోని బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ పరిధిలో ఈ సంఘటన జరిగింది. కె. రాకేష్ అనే నిందితుడు డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. కొన్నాళ్ల క్రితం అతను ఓ యువతిని ఆమెను వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత విడాకులు ఇచ్చాడు. 

ఆ తర్వాత ఎనిమదో తరగతి చదువుతున్న 14 ఏళ్ల బాలికపై అతను కన్నేశాడు. ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. ప్రేమిస్తున్నానని నమ్మించాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి తన గదికి తీసుకుని వెళ్లాడు. అత్యాచారం చేశాడు. ఎవరికైనా చెప్తే చంపేస్తానని బెదిరించాడు. 

ఇంటికి వచ్చిన బాలికకు కడుపులో నొప్పి ప్రారంభమైంది. తల్లిదండ్రులు నిలదీయడంతో అసలు విషయం చెప్పింది. తల్లిదండ్రులతో కలిసి బాధితురాలు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకుని నిందితుడిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Holidays : ఇంకో రెండ్రోజులే స్కూళ్లు నడిచేది.. వరుసగా నాల్రోజులు సెలవులే
Telangana Budget Sessions: తెలంగాణ బడ్జెట్ సమావేశాలు.. Governor Telugu Speech | Asianet News Telugu