డికే అరుణ భేటీ: ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి బిజెపి గాలం

Published : Jun 07, 2021, 07:04 AM ISTUpdated : Jun 07, 2021, 07:05 AM IST
డికే అరుణ భేటీ: ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి బిజెపి గాలం

సారాంశం

బిజెపి నేత డీకె అరుణ కాంగ్రెసు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో సమావేశమయ్యారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఆమె బిజెపిలోకి ఆహ్వానించారు. త్వరలో నిర్ణయం చెబుతానని కోమటిరెడ్డి చెప్పారు.

హైదరాబాద్: తెలంగాణలో వలస ద్వారా బలాన్ని పెంచుకునే యోచనలో బిజెపి ఉన్నట్లు అర్థమవుతోంది. ఇతర పార్టీలకు చెందన నాయకులను తమ పార్టీలోకి ఆహ్వానించడంలో బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి డీకె అరుణ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇటీవల ఆమె కాంగ్రెసుకు రాజీనామా చేసిన కొండా విశ్వేశ్వర రెడ్డిని కలిశారు. 

తాజాగా డికె అరుణ కాంగ్రెసు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో సమావేశమయ్యారు. ఇరువురి మధ్య దాదాపు నాలుగు గంటల పాటు సుదీర్ఘమైన చర్యలు జరిగాయి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఆమె పార్టీలోకి ఆహ్వానించారు త్వరలో తన నిర్ణయాన్ని తెలియజేస్తానని రాజగోపాల్ రెడ్డి డికె అరుణకు చెప్పినట్లు తెలుస్తోంది. 

మూడు రోజుల క్రితం డికె అరుణ కొండా విశ్వేశ్వర రెడ్డితో భేటీ ఆయ్యారు. ఆయనను బిజెపిలోకి ఆహ్వానించారు. ఆయన సానుకూలంగా ప్రతిస్పందించినట్లు తెలుస్తోంది. కొండా విశ్వేశ్వర రెడ్డి కాంగ్రెసు పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. 

కాగా, మాజీ మంత్రి ఈటల రాజేందర్ త్వరలో బిజెపిలో చేరుతారనే ప్రచారం జరుగుతోంది. ఈ నెల 11వ తేదీ తర్వాత ఆయన బిజెపిలో చేరవచ్చునని అంటున్నారు. ఆయనతో పాటు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, కరీంనగర్ జిల్లా పరిషత్ మాజీ చైర్ పర్సన్ తుల ఉమ బిజెపిలో చేరుతారని అంటున్నారు.

మాజీ మంత్రి డికె ఆరుణ కాంగ్రెసు నుంచే బిజెపిలోకి వచ్చారు. తన పరిచయాలను వాడుకుంటూ కాంగ్రెసు నేతలను బిజెపిలోకి తేవడంలో ఆమె కీలక పాత్ర పోషిస్తున్నట్లు అర్థమవుతోంది. 

PREV
click me!

Recommended Stories

Kalvakuntla Kavitha: కొడంగల్‌లో 22 వేల డూప్లికేట్ ఓట్లు? కవిత సంచలన కామెంట్స్| Asianet News Telugu
Rugby Premier League: ముంబైని చితక్కొట్టిన హైదరాబాద్ హీరోస్.. గచ్చిబౌలిలో చిరంజీవి, పీవీ సింధు హంగామా