అనాథ ఆశ్రమంలో బాలికపై అత్యాచారం

By telugu news teamFirst Published Aug 8, 2020, 7:51 AM IST
Highlights

గత నెల బోయిన్‌పల్లిలోని పెద్దమ్మ ఇంటికి వెళ్లిన బాలిక అనారోగ్యంగా కనిపిస్తుండటంతో ఆమెను వైద్యుడి వద్దకు తీసుకెళ్లారు. వైద్య పరీక్షల్లో బాలిక అత్యాచారానికి గురైనట్లు తేలింది.

అనుకోకుండా తన వాళ్లందరినీ కోల్పోయింది.  దీంతో నా అనేవారు లేక ఒంటరిదైపోయింది. చేసేదిలేక అనాథ ఆశ్రమానికి చేరింది. అలా ఆశ్రమానికి చేరిన బాలిక పట్ల దయ చూపాల్సిందిపోయి.. ఓ వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. ఈ దారుణ సంఘటన సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ లో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లోని హెచ్‌ఎంటీ స్వర్ణపురివెదిరి కాలనీలో మారుతీ అనాథాశ్రమం పేరిట ఒక స్వచ్ఛంద సంస్థ ఉంది. తన తల్లిదండ్రుల్ని కోల్పోయిన 14 ఏళ్ల బాలికను ఆమె బంధువులు అందులో చేర్పించారు. దాతృత్వం నెపంతో మియాపూర్‌కు చెందిన వేణుగోపాల్‌ రెడ్డి(51) అనే వ్యక్తి తరచూ ఆశ్రమానికి వచ్చేవాడు. ఈ క్రమంలో బాలికతో పరిచయం పెంచుకుని, ఆమెపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. 

గత నెల బోయిన్‌పల్లిలోని పెద్దమ్మ ఇంటికి వెళ్లిన బాలిక అనారోగ్యంగా కనిపిస్తుండటంతో ఆమెను వైద్యుడి వద్దకు తీసుకెళ్లారు. వైద్య పరీక్షల్లో బాలిక అత్యాచారానికి గురైనట్లు తేలింది. దీంతో బాలిక పెద్దమ్మ బోయిన్‌పల్లి పోలీసు స్టేషన్‌లో గత నెల 31న ఫిర్యాదు చేశారు. అనంతరం సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌ పోలీసుస్టేషన్‌కు కేసు బదిలీ అయింది.

 పరారీలో ఉన్న నిందితుడు వేణుగోపాల్‌రెడ్డితో పాటు ఆశ్రమ నిర్వాహకులు విజయ, జయదీ్‌పలను పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. వారిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఆశ్రమాన్ని మూసివేయడంతో.. అందులో ఉన్న 70 మంది పిల్లలను ప్రభుత్వ హాస్టళ్లకు తరలించారు.

click me!