మహిళా టెకీ అనుమానాస్పద మృతి: భర్తపై అనుమానాలు

Siva Kodati |  
Published : Aug 07, 2020, 07:27 PM IST
మహిళా టెకీ అనుమానాస్పద మృతి: భర్తపై అనుమానాలు

సారాంశం

ఎంతో ఇష్టపడి, ప్రేమించి పెళ్లి చేసుకున్న వారి జీవితాలు విషాదంగా ముగుస్తున్నాయి. తాజాగా కామారెడ్డి జిల్లాకు చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని అనుమానాస్పద స్థితిలో మరణించింది.

ఎంతో ఇష్టపడి, ప్రేమించి పెళ్లి చేసుకున్న వారి జీవితాలు విషాదంగా ముగుస్తున్నాయి. తాజాగా కామారెడ్డి జిల్లాకు చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని అనుమానాస్పద స్థితిలో మరణించింది.

వివరాల్లోకి వెళితే.. కామారెడ్డికి చెందిన 25 ఏళ్ల శరణ్య సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తోంది. ఈ క్రమంలో అదే ప్రాంతానికి చెందిన తన క్లాస్‌మేట్ రోహిత్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇద్దరూ బెంగళూరులోనే ఉంటున్నారు.

కాగా పెళ్లయిన తర్వాత నుంచి రోహిత్ అసలు రూపం బయటపడింది. ప్రతిరోజూ మద్యం సేవిస్తూ ఆమెను వేధింపులకు గురిచేయడం ప్రారంభించాడు. భర్త వేధింపులు తట్టుకోలేక శరణ్య ఇటీవలే తల్లిగారింటికి వచ్చింది.

దీంతో అక్కడికి చేరుకున్న రోహిత్ ఇకపై భార్యను బాగా చూసుకుంటానని పెద్దల సమక్షంలో హామీ ఇచ్చి కాపురానికి తీసుకెళ్లాడు. ఈ నేపథ్యంలో శరణ్య మృతి చెందడం పలు అనుమానాలకు తావిస్తోంది.

రోహితే తమ కూతురిని చంపేసి ఉంటాడని లేదా ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించి వుంటాడని ఆమె తల్లి మాధవి ఆరోపిస్తోంది. తమ అల్లుడిని కఠినంగా శిక్షించాలని బాధితురాలి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Cold wave: హైదరాబాదా లేదా క‌శ్మీరా? దారుణంగా పడిపోతున్న టెంపరేచర్, వచ్చే 3 రోజులూ ఇంతే
Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు