తొమ్మిదేళ్ల చిన్నారిపై సొంత తాత లైంగిక దాడి

Published : Jul 20, 2021, 08:54 AM IST
తొమ్మిదేళ్ల చిన్నారిపై సొంత తాత లైంగిక దాడి

సారాంశం

బాలికను వైద్య పరీక్షలకు పంపించామని రిపోర్టులో లైంగికదాడి జరగలేదని తేలిందని సీఐ బాలరాజు తెలిపారు.

సొంత మనవరాలిని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిందిపోయి.. ఓ ముసలాయన దారుణంగా ప్రవర్తించాడు. తొమ్మిదేళ్ల సొంత మనవరాలిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ సంఘటన  జీడిమెట్లలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

చింతల్‌లో ఓ వృద్ధుడు(65) నివాసముంటున్నాడు. కొడుకు కూతురు (9ఏళ్లు) నాల్గోతరగతి చదువుతోంది. చిన్నారిపై వారం రోజులుగా తాత లైంగిక దాడికి పాల్పడినట్టు పాపతల్లి చెప్పింది. తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నారు. బాలికను వైద్య పరీక్షలకు పంపించామని రిపోర్టులో లైంగికదాడి జరగలేదని తేలిందని సీఐ బాలరాజు తెలిపారు.దీంతో లైంగిక ఆరోపణలు నిజమో కాదో తెలియాల్సి ఉంది.   కుటుంబ సభ్యుల మధ్య ఆస్తిగొడవలు కూడా ఉన్నాయని ఈకోణంలో కూడా కేసు విచారణ కొనసాగుతోందని తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : మరోసారి కుప్పకూలనున్న టెంపరేచర్స్.. ఈ నాల్రోజులు చుక్కలే
Hyderabad IT Jobs : మీరు సాప్ట్ వేర్ జాబ్స్ కోసం ప్రయత్నిస్తున్నారా..? కాగ్నిజెంట్ లో సూపర్ ఛాన్స్, ట్రై చేయండి