కీచక కొలీగ్.. నమ్మించి కారు ఎక్కించుకుని.. తోటి ఉపాధ్యాయురాలిపై అత్యాచారం..

Published : Mar 24, 2022, 09:19 AM ISTUpdated : Mar 24, 2022, 09:20 AM IST
కీచక కొలీగ్.. నమ్మించి కారు ఎక్కించుకుని.. తోటి ఉపాధ్యాయురాలిపై అత్యాచారం..

సారాంశం

ఓ ఉపాధ్యాయుడు నీచానికి దిగజారాడు.. తోటి ఉపాధ్యాయురాలిని చంపుతానని బెదిరించాడు. ఆ తరువాత ఆమె మీద అత్యాచారానికి పాల్పడ్డాడు. అతడిని నమ్మి కారు ఎక్కినందుకు ఆ టీచర్ మానసికంగా తీవ్ర వేదన అనుభవించింది. చివరికి..

ఖమ్మం : చంపుతానని బెదిరించి తోటి ఉపాధ్యాయురాలిపై అత్యాచారానికి పాల్పడిన కీచక ఉపాధ్యాయుడిపై khammam ఖానాపురం హవేలి పోలీస్ స్టేషన్లో మంగళవారం రాత్రి కేసు నమోదయ్యింది.  సీఐ రామకృష్ణ కథనం ప్రకారం..  మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం గూడెం పాఠశాలలో బాణోతు కిశోర్ teacherగా పని చేస్తున్నాడు. ఆయన ఓ సంఘం మండల అధ్యక్షుడిగా ఉన్నాడు.  ఆయన భార్య కూడా ఉపాధ్యాయురాలే. ఖమ్మంలో నివసించే వారు ఇద్దరూ కారులో పాఠశాలకు వెళ్ళి వస్తుంటారు. అదే మండలంలో పనిచేస్తూ ఖమ్మంలో నివసించే ఓ ఉపాధ్యాయురాలు నిత్యం మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ వరకు ప్యాసింజర్ రైలులో,  అక్కడినుంచి ద్విచక్ర వాహనంపై విధులకు వెళ్లి వస్తూ ఉంటుంది.  ఈనెల 16 నుంచి పాఠశాలలు ఒంటిపూట నిర్వహిస్తున్నారు.

17న ఇంటికి తిరిగి వచ్చేందుకు రైల్వేస్టేషన్లో వేచి ఉన్న సదరు మహిళా ఉపాధ్యాయురాలిని తన భార్య కూడా వస్తుందని నమ్మించి కారు ఎక్కించుకున్నాడు సదరు ఉపాధ్యాయుడు. ఆ తరువాత ఆమెను చంపుతానని బెదిరించి సెల్ఫోన్ లాక్కున్నాడు. మార్గమధ్యలో  పాండురంగాపురంలోని ఓ ఇంటికి తీసుకువెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు.. ఎవరికైనా చెబితే ఆమె భర్తను, పిల్లలను చంపుతానని బెదిరించాడు. దీంతో విషయం ఎవరికీ చెప్పలేదు. అయితే  తీవ్రంగా మదన పడిన ఆమె మంగళవారం తన భర్తకు విషయం తెలిపింది. వెంటనే భర్తతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడు కిశోర్ పరారీలో ఉన్నాడని సీఐ వివరించారు. 

ఇదిలా ఉండగా,  ఓ కర్కశ తండ్రి కన్నకూతుర్లపైనే Sexual assaultకి ప్రయత్నించాడు. వనస్థలిపురం పరిధిలో ఆలస్యంగా ఆదివారం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… Nalgonda District దేవరకొండలోని ఓ తండాకు చెందిన వ్యక్తి భార్య, ఐదుగురు సంతానం. వారిలో 20, 13,  పదకొండేళ్ల కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. వనస్థలిపురం ఓ కాలనీలో వీరు ఉంటున్నారు. అతను ఆటో డ్రైవర్. మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో అతడి కన్ను ఎదిగిన కుమార్తెలపై పడింది. నిత్యం liquor తాగి వచ్చి వారిని లైంగికంగా వేధించసాగాడు. అతడి ప్రయత్నాలను ఎప్పటికప్పుడు wife ప్రతిఘటించేది.  

అయితే, ఈనెల 17న ఆమెను కొట్టి ఇంటి నుంచి వేరే గ్రామానికి పంపించాడు. శుక్రవారం రాత్రి ఇంటికి వచ్చి మొదట తన 13 ఏళ్ల కుమార్తె లైంగిక దాడికి ప్రయత్నించాడు. మిగతా కుమార్తెలు అరవడంతో భయపడిన అతడు ఇంటి గేటుకు తాళం వేసి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత అక్క చెల్లెలు అక్కడినుంచి తప్పించుకుని షీ టీమ్ కు, పోలీసులకు ఫోన్ చేశారు. రెండు గంటలైనా స్పందన లేకపోవడంతో తమను పోలీసులు రక్షించలేరని భావించి.. ఆత్మహత్య చేసుకునేందుకు సమీపంలోని చెరువు వద్దకు వెళ్లారు. ఆ సమయంలో అక్కడున్న మహిళా వారిని చేరదీసి ఓ స్వచ్ఛంద సంస్థ ఫోన్ నెంబర్ ఇచ్చింది.

ఆ ముగ్గురూ ఆ సంస్థ ప్రతినిధికి ఫోన్ చేసి వివరాలు తెలిపారు. సదరు ప్రతినిధి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వెంటనే చెరువు వద్దకు చేరుకున్న పోలీసులు ముగ్గురిని ఠాణాకు తీసుకువెళ్లి ఫిర్యాదు తీసుకున్నారు . వారి తండ్రిని అదుపులోకి తీసుకున్నారు.  కుమార్తెల పై లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపిస్తూ అతడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. శనివారం రాత్రి రిమాండ్కు తరలించారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

డియర్ పేరెంట్స్.. 'సామాన్లు' కామెంట్స్ కాదు సమస్య.. మీ పిల్లలకు అసలు సమస్య ఇదే..!
IMD Cold Wave Alert : తెలంగాణపై చలిపిడుగు... ఈ నాలుగు జిల్లాల ప్రజలు తస్మాత్ జాగ్రత్త