అనుమానం.. ఇద్దరు భార్యలను కడతేర్చిన భర్త..!

Published : May 19, 2021, 08:53 AM IST
అనుమానం.. ఇద్దరు భార్యలను కడతేర్చిన భర్త..!

సారాంశం

నిందితుడు కిరణ్ 2013లో పద్మ అనే మహిళను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత భార్య మరొకరితో అక్రమ సంబంధం పెట్టుకుందనే అనుమానంతో ఆమెను హత్య చేసి శవాన్ని ఇంట్లోనే పాతిపెట్టాడు.

తానే సర్వస్వం అంటూ నమ్మి వచ్చిన ఇద్దరు భార్యలను భర్త అతి దారుణంగా హత్య చేశాడు. ఈ సంఘటన వరంగల్ లో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఇటీవల రెండో భార్యను చంపేయగా... గతంలో మొదటి భార్యను కూడా హత్య చేసిన పోలీసుల దర్యాప్తులో తేలడం గమనార్హం.

అదనపు కట్నం కోసం రెండో భార్య అంజలి(42) ని అతి కిరాతకంగా హత్య చేశాడు. ఈ హత్య కేసు విచారణలో మొదటి భార్య మృతి వెనక ఉన్న అసలు స్టోరీ కూడా బయటపడింది.

నిందితుడు కిరణ్ 2013లో పద్మ అనే మహిళను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత భార్య మరొకరితో అక్రమ సంబంధం పెట్టుకుందనే అనుమానంతో ఆమెను హత్య చేసి శవాన్ని ఇంట్లోనే పాతిపెట్టాడు. తర్వాత ఆ గ్రామాన్ని వదిలేసి వెళ్లిపోయాడు.

రెండు సంవత్సరాల క్రితం 2019లో కమలాపూర్ మండలం ఉప్పల్ కు చెందిన అంజలిని పెళ్లి చేసుకున్నాడు. ఆమె హుజూరాబాద్‌ మండలం సాధిరెడ్డిపేటలో ఏఎన్‌ఎంగా పనిచేస్తుండేది. వివాహం తర్వాత అంజలి ఇంట్లోనే మూడు నెలలు ఉన్న కిరణ్‌ అదనపు కట్నం కోసం వేధించడంతో పాటు ఉద్యోగం చేసే చోట ఇతరులతో చనువుగా ఉంటుందని అనుమానించాడు. 

అక్కడ నుంచి కాపురాన్ని ఆరునెలల క్రితం ఏనుగల్లుకు మార్చాడు. ఈ క్రమంలో అంజలి తల్లిదండ్రుల పేర ఉన్న ఇల్లును అమ్మి అదనపు కట్నం తీసుకురావాలని గొడవపడేవాడు. ఈనెల 12న రాత్రి కూడా గొడవ జరగగా ఆమెపై దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన అంజలిని స్థానికులు ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె ఈనెల 14న మృతి చెందింది.

అంజలి హత్య ఘటనలో నిందితుడు కిరణ్‌ అరెస్టు చేసి విచారించగా మొదటి భార్య హత్య కూడా బయటపడింది. అలాగే, రెండో భార్య అంజలి వేధించే క్రమంలో సెల్‌ఫోన్‌లో చిత్రీకరించి ఆ తర్వాత వీడియో చూస్తూ పైశాచిక ఆనందం పొందేవాడని గుర్తించారు.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో చలి తుపాను బీభత్సం.. ఆల్ టైమ్ రికార్డ్ టెంపరేచర్స్ తో ఇక్కడ అల్లకల్లోలమే
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు