హైదరాబాద్ మియాపూర్‌లో దారుణం.. పట్టపగలు అందరూ చూస్తుండగానే వ్యక్తి దారుణ హత్య..

Published : Feb 09, 2023, 12:04 PM IST
హైదరాబాద్ మియాపూర్‌లో దారుణం.. పట్టపగలు అందరూ చూస్తుండగానే వ్యక్తి దారుణ హత్య..

సారాంశం

హైదరాబాద్ మియాపూర్‌లో దారుణం చోటుచేసుకుంది. మియాపూర్ బస్టాప్ సమీపంలో పట్టపగలు అందరూ చూస్తుండగానే ఒక వ్యక్తిని దుండగులు కిరాతకంగా హత్య చేశారు.

హైదరాబాద్ మియాపూర్‌లో దారుణం చోటుచేసుకుంది. మియాపూర్ బస్టాప్ సమీపంలో పట్టపగలు అందరూ చూస్తుండగానే ఒక వ్యక్తిని దుండగులు కిరాతకంగా హత్య చేశారు. వివరాలు.. మియాపూర్ పోలీస్టేషన్ పరిధిలోని కేఎస్ బేకర్స్ వద్ద ఓ వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తిపై కొందరు దుండగులు దాడి చేశారు. బండరాయితో అతి కిరాతకంగా కొట్టారు. ఈ దాడిలో బాధితుడు అక్కడికక్కడే మృతిచెందాడు. అందరూ చూస్తుండగానే ఈ దారుణం చోటుచేసుకుంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. పోస్టుమార్టమ్ నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. 

అయితే మృతుడు ఎవరు? అతడిపై దాడి చేసిన వ్యక్తులు ఎవరు? అనే వివరాలు తెలియాల్సి ఉంది. ఇక, ఈ ఘటనకు సంబంధించి అన్ని కోణాల్లో పోలీసులు విచారణ చేపట్టారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Telangana Rising 2047: చైనాలోని ఆ నగరంలా తెలంగాణ.. సీఎం రేవంత్ కొత్త ఫార్ములా
School Holidays: స్కూళ్లకు వరుస సెలవులు.. విద్యార్థులకు డబుల్ ధమాకా