రెండు రోజుల క్రితం భార్య సూసైడ్: మంచిర్యాల మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణ అరెస్ట్

By narsimha lode  |  First Published Feb 9, 2023, 9:38 AM IST

మంచిర్యాల మున్సిపల్ కమిషనర్  బాలకృష్ణను  పోలీసులు అరెస్ట్  చేశారు. రెండు రోజుల క్రితం  బాలకృష్ణ భార్య జ్యోతి సూసైడ్  చేసుకున్నారు.  



మంచిర్యాల:  మంచిర్యాల  మున్సిపల్  కమిషనర్  ఎన్. బాలకృష్ణ‌ను  పోలీసులు  బుధవారం నాడు  అరెస్ట్  చేశారు.  రెండు రోజుల క్రితం  బాలకృష్ణ భార్య జ్యోతి  ఆత్మహత్య చేసుకొంది.  

బాలకృష్ణతో పాటు అతని కుటుంబసభ్యుల వేధింపుల కారణంగా తమ కూతురు జ్యోతి ఆత్మహత్య చేసుకుందని  మృతురాలి  పేరేంట్స్ ఆరోపిస్తున్నారు.  ఈ నెల  7వ తేదీన  ఉదయం  బాలకృష్ణ తనను చంపేలా ఉన్నారని  జ్యోతి తమకు  ఫోన్ చేసిందని  జ్యోతి  పేరేంట్స్  ఆరోపిస్తున్నారు.  అయితే  తాము మంచిర్యాలకు  వచ్చేసరికి  జ్యోతి ఆత్మహత్య  చేసుకుందని  పేరేంట్స్  కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. 

Latest Videos

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కూసుమంచి మండలం కేశవాపురం  మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణ స్వగ్రామం.   ఇదే జిల్లాలోని  కొణిజర్ల మండలం  సీతారాంపురం  గ్రామానికి  చెందిన   జ్యోతిని  2014లో  బాలకృష్ణ వివాహం  చేసుకున్నారు.   వివాహం చేసుకున్న సమయంలో  బాలకృష్ణ  కానిస్టేబుల్  గా హైద్రాబద్ లో విధులు నిర్వహించేవాడు.  కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తూనే  గ్రూప్స్ పరీక్షలు  రాశాడు.  ఈ పరీక్షల్లో   ఉత్తీర్థత సాధించి  మున్సిపల్ కమిషనర్  ఉద్యోగాన్ని సాధించారు.  ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని  నిర్మల్ లో  మున్సిపల్ కమిషనర్ గా  తొలుత బాధ్యతలు చేపట్టారు. ఏడాదిన్నర క్రితం  గ్రేడ్-  1 మున్సిపల్ కమిషనర్ గా  బాలకృష్ణ పదోన్నతి పొందాడు.  ప్రమోషన్ పొందిన తర్వాత  ఏడాదిన్నరక్రితం మంచిర్యాల మున్సిపల్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టారు.  

also read:మంచిర్యాలలో విషాదం.. మున్సిపల్ కమిషనర్ భార్య ఆత్మహత్య..వేధింపులే కారణమా?

మున్సిపల్ కమిషనర్ గా  ఉద్యోగం  వచ్చిన నాటి నుండి  అదనపు కట్నం కోసం  జ్యోతిని వేధంపులకు గురి చేస్తున్నారని మృతురాలి  కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. .రెండు రోజుల క్రితం  అదనపు కట్నం కోసం భార్య జ్యోతితో బాలకృష్ణ గొడవ పెట్టుకున్నారని  మృతురాలి  బంధువులుఆరోపిస్తున్నారు.  బాలకృష్ణ సహ  అతని  కుటుంబసభ్యులపై  జ్యోతి  కుటుంబసభ్యులు  ఫిర్యాదు  చేశారు. బాలకృష్ణ సహ  అతని కుటుంబానికి  చెందిన  ఐదుగురిపై  కేసు నమోదు  చేశారు పోలీసులు . ఈ కేసులో  బాలకృష్ణను  బుధవారం నాడు రాత్రి పోలీసులు అరెస్ట్  చేసి రిమాండ్  కు తరలించారు. బాలకృష్ణ, కుటుంబసభ్యులను  పోలీసులు అరెస్ట్  చేయాల్సి ఉంది. 
 

click me!